Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రస్తుతం కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలు రోకో నిర్వహించారు. ఆమెతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల కవితను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.
High Court: తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఈ రోజు విచారించనుంది. బీసీ జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు కేటాయించలేదన్న ఆరోపణలతో పలువురు అభ్యర్థులు కోర్టు ఆశ్రయించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల తిమ్మనోనిపల్లి గ్రామ రిజర్వేషన్లపై ఒక పిటిషన్ దాఖలైంది. గ్రామంలోని అన్ని వార్డులను ఎస్సీ, ఎస్టీ వర్గాలకే కేటాయించారని, కానీ అక్కడ బీసీ జనాభా ఎక్కువగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని వాదిస్తున్నారు.
OTR : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మొదట గ్రామపంచాయతీ, ఆ తర్వాత ఎంపీటీసీ, zptc, మున్సిపల్ ఎలక్షన్స్ జరపాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే… ఈ ఎన్నికలు మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాషాయదళానికి మాత్రం అగ్ని పరీక్షేనన్న వాదన వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు అది వర్తిస్తుందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి… ఆ ఫీల్‌గుడ్‌తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నది పార్టీ…
Telangana Cabinet Meeting: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే, అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేడు బీసీ రిజర్వేషన్ లపై సీఎం రేవంత్ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం జరుగనున్నది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. సమీక్ష కి డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి పొన్నం… తదితరులు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపద్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. న్యాయ నిపుణులను కూడా సమావేశానికి ప్రభుత్వం పిలిచింది. Also Read:Trump-Netanyahu: నెతన్యాహు మోసం చేశాడు..…
Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితిని తొలగించేలా.. రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు. ఈ అంశంపై ఆరుగురు మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన అనంతరం…