Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితిని తొలగించేలా.. రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు. ఈ అంశంపై ఆరుగురు మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం…