Train fraud AP: పల్నాడు జిల్లాలో నకిలీ టీటీఈ రైళ్లలో తిరుగుతున్నాడు. మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్లో జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహించాడు. ఇక, అదే రైళ్లో తనిఖీలు చేస్తున్న గుంటూరుకి చెందిన అసలు టీటీఈ జాన్ వెస్లీకి నకిలీ టీటీఈ తారసపడ్డాడు. టీటీఈగా గుర్తింపు కార్డు చూపాలని నకిలీ టీటీఈని జాన్ వెస్లీ ప్రశ్నించాడు. విధుల్లో ఉన్న జాన్ వెస్లీతో అతడు వాదనకు దిగాడు. రైలు నరసరావుపేటకి రాగానే దూకి పరారైయ్యేందుకు ప్రయత్నం చేశాడు.
Read Also: Bombay High Court: వివాహ సమస్యలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి.. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు..
అయితే, నరసరావుపేటలో నకిలీ టీటీఈని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నరసరావుపేట రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు నకిలీ టీటీఈ. కాగా, గత కొన్ని రోజులుగా టీటీఈగా చెలామణి అవుతూ రైళ్లలో తిరుగుతున్న నిందితుడు.. అవినాష్ కృష్ణ గుప్తా అనే వ్యక్తి నకిలీ టీటీఈగా అవతారం ఎత్తాడని రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అవినాష్ కృష్ణ గుప్తా గతంలో బిలాస్ పూర్ పరిధిలో రైల్వే గార్డుగా పని చేసి ప్రమాదం బారిన పడటంతో ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయ్యాడని గుర్తించారు.