పల్నాడు జిల్లా శావల్యపురం మండలం కనుమర్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లే ల్యాండ్ వ్యాన్, ఆటోఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న రూరల్ సిఐ ప్రభాకర్ రావు పరిస్థితిని సమీక్షించారు. మృతులంతా శావల్యాపురం మండలం కారుమంచి వాసులుగా గుర్తించారు. మృతులు బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ, రమణ, ముత్యాలమ్మలుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వినుకొండ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.