Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడం వల్ల పౌరుల మరణాల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అల్ జజీరా రిపోర్టర్ వేల్ అల్-దహదౌహ్ కుటుంబం మొత్తం చనిపోయారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్దంతో గాజాలో తీవ్ర నష్టం జరిగింది. దీంతో గాజా స్ట్రిప్ లో ఆరోగ్య సామాగ్రి, ఇంధనం యొక్క సురక్షితమైన రవాణాను సులభతరం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్షణ మానవతా కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది
ఇజ్రాయెల్ సైనికుల విమానాలు పాలస్తీనాలో కరపత్రాలు చల్లుతున్నారు. ఇజ్రాయెల్ పౌరులను హమాస్ గ్రూపు బంధించిన వివరాలను తమకు అందించాలని.. అలా ఇచ్చిన వారికి రివార్డులు ఇస్తామని ఆ కరపత్రాల్లో పేర్కొంది.
ఈ సంక్షోభ సమయంలో పాలస్తీనా ప్రజల కోసం సాయం చేసే మూడు స్వచ్ఛంద సంస్థలకు తాను రూ. 2.5 కోట్లు విరాళంగా ఇస్తానని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తక్షణ కాల్పుల విరమణకు, శాశ్వత శాంతి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Israel Hamas War: గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కనీసం 500 మంది పౌరులు మరణించారు. అనేక ముస్లిం దేశాలు ఈ దాడికి ఇజ్రాయెల్ నే దోషిని చేశాయి.
ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ దేశంలో చదువుకునేందుకు వచ్చిన పాలస్తీనా యువకులపై స్థానిక గుండాలు దాడి చేశారు. ఇద్దరిని కత్తితో గాయపరిచారు. అయితే ఈ ఘటనకు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధానికి సంబంధం లేదు. పంజాబ్ ప్రావిన్సులోని గుజ్రాల్ వాలా మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను స్థానిక గుండాలు వేధించారు. అయితే తమ తోటి మహిళా విద్యార్థులకు సాయంగా ఇదేమిటని ప్రశ్నించినందుకు గుండాలు కత్తితో దాడి చేశారు.
Putin: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1300 మంది చనిపోయారు. ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిల్, గాజాలోని హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో గాజాస్ట్రిప్ లోని వేల మంది మరణిస్తున్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలుగా ఉన్న తమవారిని రెస్క్యూ చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది.
Israel: కార్లపై పరుపులు, పిల్లల్ని పట్టుకుని తల్లితండ్రులు బతుకజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. హమాస్ ఉగ్రవాదుల దాడి, పాలస్తీనాలోని గాజా ప్రాంతంలోని ప్రజలకు శాపంగా మారాయి. కేవలం 24 గంటల్లో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ప్రజలు అక్కడి నుంచి దక్షిణం వైపు కదిలివెళ్తున్నారు. కార్లపై బట్ట
France: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అయితే ఇరాన్ తో పాటు పలు ఇస్లామిక్ దేశాలు, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో హమాస్, పాలస్తీనాకు అనుకూలంగా పలువురు ర్యాలీలు చేస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లోని యూదులు, ఇజ్రాయిల్ మద్దతుదారులు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో ఓ వ్యక్తి శుక్రవారం ఏకంగా ఇజ్రాయిల్ రాయబార సిబ్బందిపైనే కత్తితో దాడి చేశాడు.
Putin: ఇజ్రాయిల్-హమాస్ యుద్దంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ సైన్యం గాజాపై గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆయన శుక్రవారం అన్నారు. నివాస ప్రాంతాల్లో భారీ యంత్రాలను ఉపయోగించడం సంక్లిష్ట విషయమని, ఇది తీవ్రపరిణామాలకు దారి తీస్తుందని అన్నారు. ముఖ్యంగా పౌరుల ప్రాణనష్టం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని చెప్పారు.