Hamas Attack On Israel: ఇజ్రాయిల్ లో హమాస్ జరిపిన హత్యాకాండలో దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నరరూప రాక్షసుల్లా ప్రవర్తించిన హమాస్ ఉగ్రవాదులు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మిషిన్ గన్లలో కాల్చుతూ.. పిల్లల తలలను తెగ నరుకుతూ అత్యంత పాశవిక దాడులకు పాల్పడ్డారు. గాజా సరిహద్దులోని ఓ కిబ్బుట్జ్ లో ఏకంగా 40 మంది పిల్లలను అత్యంత దారుణంగా చంపడం యావత్ ప్రపంచాన్ని కలవరపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా మరో వికృత చర్య…
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాద దాడిని, ఎంత పాశవికంగా ప్రజల్ని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని హతమార్చిందనే వివరాలను ఇజ్రాయిల్ ప్రపంచానికి తెలియజేస్తోంది. మెరుపుదాడిలో అనేక మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. హమాస్ దాడిలో చనిపోయిన వారి సంఖ్య 1200కు చేరుకుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని అత్యంత అమానుషంగా చంపిన విధానం అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.
USA: ఇజ్రాయిల్‌కి అగ్రరాజ్యం అమెరికా పూర్తి మద్దతును ప్రకటించింది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ దేశానికి సంపూర్ణ సహకారం అందిస్తోంది. తాజాగా గురువారం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయిల్ వెళ్లారు.
Palestine: ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై జరిపిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ తీవ్రవాదులు శనివారం భీకరదాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. గాజాలోని ప్రముఖ భవనాలను బాంబులతో కుప్పకూలుస్తోంది. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి, హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డయిఫ్ ఇంటిని టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో డయిఫ్ కుటుంబ సభ్యులు మరణించినట్లుగా హమాస్ ధృవీకరించింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇరు వైపుల మరణాల సంఖ్య 3000ను దాటింది.
Aligarh Muslim University: ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ యుద్ధంలో ఇండియాలోని ప్రజలు కూడా ఇరుపక్షాలకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో పాలస్తీనాకు మద్దతుగా కొందరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు పలువరు విద్యార్థులు సోమవారం మార్చ్ నిర్వహించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Israel: గాజాపై విరుచుకుపడేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. శనివారం హమాస్ టెర్రరిస్టులు జరిపిన దాడిలో 900 మంది వరకు ఇజ్రాయిల్ ప్రజలు చనిపోయారు. ఇదిలా ఉంటే భారీ స్థాయిలో యుద్ధం చేసేందుకు ఇజ్రాయిల్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే తాము యుద్ధంలో ఉన్నామని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యహూ ప్రకటించాడు. యుద్ధం మీరు మొదలుపెట్టారు, తాము ముగిస్తామని హమాస్‌కి వార్నింగ్ ఇచ్చారు.
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరు పక్షాలు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటున్నాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. యుద్ధాన్ని హమాస్ మొదలుపెట్టింది, మేము ముగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హమాస్ ఉగ్రసంస్థను నెతన్యాహు ఐసిస్‌తో పోల్చారు. మేము యుద్ధాన్ని కోరుకేలేదు,
Israel Hamas War: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఖైదీల మార్పిడికి ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ఉగ్రవాద గ్రూపులోని ఒకరు తెలిపినట్లు తెలిసింది. అమెరికా మద్దతుతో, ఖతార్ ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుకుంటోంది.