Google: ఇజ్రాయెల్ టెక్ సంస్థలు, పాలస్తీనా వ్యాపారాలకు మద్దతుగా Google $8 మిలియన్లు పెట్టుబడి పెడుతోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ సమయంలో ఫైనాన్సింగ్‌ను పొందేందుకు చిన్న కంపెనీల అవసరాన్ని పేర్కొంటూ ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గ్రూప్ బుధవారం తెలిపింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య అక్టోబర్ నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు గాజాలోని హమాస్‌కు భారీ నష్టం కలిగించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు మరణించగా.. 158 మంది గాయపడ్డారు.
Israel-Hamas: ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో అమెరికా ఇజ్రాయిల్ పక్షాన నిలబడింది. అయితే యూఎస్‌లో జరిగిన ఓ పోల్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా యంగ్ అమెరికన్లు హమాస్‌కి మద్దతుగా నిలుస్తు్న్నట్లు తేలింది. చాలా మంది యువ అమెరికన్ పౌరులు ఇజ్రాయిల్ ఉనికి కోల్పోవాలని, గాజాను నియంత్రిస్తున్న హమాస్‌కే అప్పగించాలనే అభిప్రాయాలను వెల్లడించినట్లుగా పోల్‌లో తేలింది.
Israel-Hamas War: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై 49 రోజులు అవుతోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ నిరంతరం గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులను నిర్వహిస్తోంది.
Hamas: గాజాపై ఇజ్రాయిల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు ఆస్పత్రుల మాటున ఉన్న హమాస్ తీవ్రవాదుల్ని అంతం చేసేందుకు ముమ్మరదాడుల్ని నిర్వహిస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇక్కడి నుంచే హమాస్ టన్నెల్ వ్యవస్థ మొదలవుతోందని, ఆస్పత్రులను హమాస్ రక్షణగా ఉపయోగించుకుంటోదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అల్ షిఫా ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు ఐడీఎఫ్ సిద్ధమైంది.
India at UN: తూర్పు జెరూసలేంలో పాటు ఆక్రమిత పాలస్తీనా భూభాగం, ఆక్రమిత సిరయన్ గోలన్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సెటిల్‌మెంట్ కార్యకలాపాలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితితో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఇజ్రాయిల్ వైఖరిని ఖండిస్తూ భారత్ ఓటసింది. తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటేయగా అందులో భారత్ కూడా ఉంది. ఈ ముసాయిదా తీర్మానానికి నవంబర్ 9 గురువారం ఆమోదం లభించింది.
CM Pinarayi Vijayan: కేరళలో పాలక సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా సంఘీభావం ర్యాలీలను చేపడుతున్నాయి. శనివారం కోజికోడ్ వేదికగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు.
IIT Bombay: ఐఐటీ - బాంబే మరోసారి వార్తల్లో నిలిచింది. గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిన ఓ ప్రొఫెసర్ పాలస్తీనా ఉగ్రవాదులను కీర్తించడం వివాదాస్పదం అయింది. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 6న జరిగిన దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత నెలరోజులుగా ఈ వార్ నడుస్తుంది. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు బలయ్యాయి. ఇప్పటివరకు 10 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ అల్ జజీరా నివేదిక పేర్కొంది.
Priyanka Gandhi: ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిస్తూ శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ)లో పలు దేశాలు కలిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. గాజా స్ట్రిప్కి సాయం అందించడానికి, పౌరులకు రక్షణ కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్ కి భారతదేశం దూరంగా ఉంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై నేను సిగ్గుపడుతున్నా అని అన్నారు.