Israel-Hamas War: గాజా ఆస్పత్రిలో బందీలుగా ఉంచిన హమాస్ కమాండర్‌ని హతమార్చిన ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas: గాజాపై ఇజ్రాయిల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు ఆస్పత్రుల మాటున ఉన్న హమాస్ తీవ్రవాదుల్ని అంతం చేసేందుకు ముమ్మరదాడుల్ని నిర్వహిస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇక్కడి నుంచే హమాస్ టన్నెల్ వ్యవస్థ మొదలవుతోందని, ఆస్పత్రులను హమాస్ రక్షణగా ఉపయోగించుకుంటోదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అల్ షిఫా ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు ఐడీఎఫ్ సిద్ధమైంది.
గాజా ఆస్పత్రిలో 1000 మంది వ్యక్తుల్ని, రోగుల్ని బందీలుగా ఉంచుకుని, వారు తప్పించుకోకుండా ప్రయత్నించిన సీనియర్ హమాస్ కమాండర్‌ని వైమానిక దాడిలో చంపినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. అహ్మద్ సియామ్ హమాస్‌కి చెందిన నాజర్ రద్వాన్ కంపెనీలో కమాండర్ అని.. ఉగ్రవాద దాడుల్లో పౌరులను మానవకవచాలుగా ఉపయోగించుకున్నారని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో వెల్లడించింది.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Read Also: Tollywood: సక్సెస్ ఫుల్ హీరోల భార్యలను చూశారా.. హీరోయిన్లను మించి ఉన్నారుగా
మరోవైపు అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయిల్ దాడుల వల్ల పసిపిల్లలు, ఇతర రోగులు చనిపోతున్నారని హమాస్ నేతృత్వంలోని ఆరోగ్యశాఖ ఆరోపించింది. ఇద్దరు నవజాత శిశువులు మరణించినట్లు తెలిపింది. కరెంట్ సౌకర్యం లేకపోవడం వల్ల డజన్ల కొద్దీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తెలిపింది. కాగా, తమ లక్ష్యం గాజాలో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ అని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ అన్నారు. అతనిని చంపాలని పాలస్తీనియన్లకు పిలుపునిచ్చారు. అలా అయితే యుద్ధం ఆగిపోతుందని అన్నారు. తాము యాహ్యా సిన్వార్‌ని ఖచ్చితంగా హతమారుస్తామని అన్నారు. యూరప్‌తో పాటు అరబ్ దేశాలు కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని ఇజ్రాయిల్‌ని కోరుతున్నప్పటికీ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇందుకు తిరస్కరిస్తున్నారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్ భూభాగంలోకి వచ్చిన ఉగ్రవాదులు 1400 మందిని క్రూరంగా హతమార్చారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 11 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..