Gopichand: ఏనుగు ఎక్కేందుకు సిద్ధం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు భారత చిత్రసీమలోని భాషా బేధాలు పూర్తిగా తొలగిపోయిన సంగతి తెలిసిందే! అక్కడి దర్శకులు ఇక్కడి హీరోలతోనో, ఇక్కడి దర్శకులు అక్కడి హీరోలతోనో జత కట్టేస్తున్నారు. ముఖ్యంగా.. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఈ క్రేజీ కాంబోలో బోలెడన్నీ కుదిరాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కలయిక చేరనున్నట్టు కనిపిస్తోంది. అదే.. డైరెక్టర్ హరి, మన మ్యాచో మ్యాన్ గోపీచంద్.
తమిళ దర్శకుడు హరి ఎప్పట్నుంచో తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా.. సింగం సిరీస్‌తో తనకు తెలుగులోనూ మంచి పేరు రావడంతో, మన హీరోలతో కలిసి సినిమాలు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. కానీ, ఎందుకో ఆ ప్లాన్స్ వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్‌గా ఏనుగు సినిమా తీసిన ఈ దర్శకుడు కోరిక.. ఎట్టకేలకు ఇన్నాళ్లకు వర్కౌట్ అయినట్టు తెలుస్తోంది. మ్యాచో మ్యాన్ గోపీచంద్‌తో ఓ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నట్టు వార్తలు వస్తు్న్నాయి. కొన్నిరోజుల కిందట ఇతడు చెప్పిన ఓ స్టోరీ నచ్చడంతో.. గోపీచంద్ అందుకు పచ్చజెండా ఊపాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయమై అధికార ప్రకటన కూడా రానుందట! ఎంతైనా మాస్ సినిమాలకు హరి కేరాఫ్ అడ్రస్ కాబట్టి, ఆయన ట్రాక్ రికార్డ్ చూసి గోపీచంద్ సినిమాకి ఓకే చెప్పి ఉంటాడని తెలుస్తోంది.
Also Read
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
నిజానికి.. హరి చెప్పిన కథ ఆల్రెడీ జూ. ఎన్టీఆర్‌కి వినిపించిందట! ఆర్ఆర్ఆర్‌కి ముందే అతను తారక్‌తో ఓ సినిమా కోసం చర్చలు జరిపాడు. అయితే.. తారక్ ఆర్ఆర్ఆర్‌కి కమిట్ అవ్వడం, కరోనా వల్ల ఆలస్యం అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకుండానే అటకెక్కేసింది. ఇప్పుడదే స్టోరీని గోపీచంద్‌కి వినిపించి, సినిమాకి హరి గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడని అంటున్నారు. కానీ, హరి ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఏనుగు తెలుగులో వచ్చినా, ఎవరూ పట్టించుకోవడం లేదు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో గోపీచంద్‌కి అతడు హిట్ ఇస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?