మారుతి ట్రాక్ రికార్డ్ ప్రకారం.. మినిమం గ్యారంటీ సినిమా తీయగలడు అనే టాక్ ఉంది. అలాంటి మారుతికి ఇప్పుడు భారీ లైనప్ ఉండడం విశేషం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలు మారుతితో లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కుర్ర హీరో నుంచి సీనియర్ హీరోలు ఉన్నారు.. ఇంతకీ మారుతితో ఈ స్టార్ హీరోలు సినిమాలు చేస్తారా..!
‘ఈరోజుల్లో’ సినిమాతో మెగా ఫోన్ పట్టిన మారుతి.. ప్రేమకథా చిత్రమ్.. భలే భలే మగాడివోయ్.. ప్రతిరోజూ పండగే.. వంటి చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్‌గా గోపీచంద్‌తో చేసిన పక్కా కమర్షియల్ మూవీ కూడా మారుతి స్టైల్ మార్కులే దక్కించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు మారుతి. అంతేకాదు మెగాస్టార్ కూడా మారుతికి స్టేజ్ పైనే మెగా ఆఫర్ ఇచ్చాడు. ఇదంతా మారుతి గాల్లో తేలిపోయే న్యూస్ అనే చెప్పాలి. కానీ ప్రభాస్, చిరుతో సినిమాలు ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే సూచనలు లేవు. పైగా పక్కా కమర్షియల్ మూవీ మారుతికి పెద్దగా కలిరాలేదు. దాంతో ఈ లోపు మరో హిట్ కొట్టి తన సత్తా చాటాలనుకుంటున్నాడట. అందుకే న్యాచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అది భలే భలే మగాడివోయ్ సీక్వెల్ కూడా అయి ఉండొచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు మారుతి లైనప్‌లోకి మరో మెగా హీరో వచ్చాడని తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో ఓ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట మారుతి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రతిరోజే పండగే’ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో తనకు హిట్ ఇచ్చిన నాని లేదా సాయి ధరమ్‌తో కలిసి మరోసారి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడట మారుతి. ఒకవేళ వీళ్లతో సినిమాలు ఉన్నా లేకపోయినా.. చిరంజీవి, ప్రభాస్ లైన్లో ఉన్నారు కాబట్టి.. ఇప్పట్లో మారుతికి ఢోకా లేదని చెప్పొచ్చు. ఏదేమైనా మారుతికి ఇదే మంచి టైం అని చెప్పొచ్చు.