Pakka Commercial ott date fixed: మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ మూవీ జూలై 1న థియేటర్లలో విడుదలైంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. యూవీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌లపై బన్నీవాసు, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తాజాగా వెల్లడించింది. ఆగస్టు 5 నుంచి పక్కా కమర్షియల్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో థియేటర్లలో చూడని వాళ్లు ఈ చిత్రాన్ని ఇంట్లోనే చూడాలంటే మరో ఐదు రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా నటించింది.
Read Also: Cinema Shootings: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్‌లు నిలిపివేత.. ఫిలిం ఛాంబర్ నిర్ణయం
పక్కా కమర్షియల్ మూవీకి జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. జిల్, ఆక్సిజన్ మూవీస్ తర్వాత గోపీచంద్, రాశీ ఖన్నా జోడీగా మరోసారి పక్కా కమర్షియల్ మూవీలో కనిపించారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించాడు. గత ఏడాది ఆరడగుల బుల్లెట్ సినిమా తర్వాత గోపీచంద్ వెండితెరపై కనిపించలేదు. ఈ నేపథ్యంలో గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా చేయడం అందరిలోనూ ఆసక్తి రేపింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వీకెండ్ ముగిసిన తర్వాత బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే వసూళ్లను రాబట్టింది. సాధారణంగా మారుతి సినిమాల్లో కామెడీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. సరదాగా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు ఆయన సినిమాలను చూడటానికి ఇష్టపడతారు. అయితే పక్కా కమర్షియల్ మూవీలో కామెడీ పాళ్లు తగ్గాయనే టాక్ వినిపించింది. కాగా ఆగస్టు 5నే మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లోనూ పక్కా కమర్షియల్ సినిమా విడుదల కానుంది.
Macho 🌟 @YoursGopichand & @RaashiiKhanna_'s #PakkaCommercial to Premiere from August 5th on @ahavideoIN 💫#PakkaCommercialOnAHA #AlluAravind @DirectorMaruthi #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @UV_Creations @GA2Official @adityamusic pic.twitter.com/zpUyYhsTmC
— GA2 Pictures (@GA2Official) July 31, 2022