కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల కావాల్సిన సినిమా తేదీలు, షూటింగ్స్ లో ఉన్న సినిమాల షెడ్యూల్స్ అన్ని తారుమారు అయ్యాయి. ఇదిలావుంటే, టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్-తమన్నా భాటియా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కుతుంది. మరోవైపు గోపీచంద్-రాశిఖన్నా జోడిగా మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాడు. కాగా సీటీమార్ సినిమా ఏప్రిల్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా…
సక్సెస్, ఫెయిల్యూర్స్ ను బేరీజు వేసుకుంటే… రాశీఖన్నా ఖాతాలో పడిన పరాజయాలే అధికం. అయినా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో అమ్మడు భలే జోరును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే తెలుగులో ‘పక్కా కమర్షియల్, థ్యాంక్యూ’ మూవీస్ లో నటిస్తున్న రాశీ ఖన్నా ఇతర భాషల్లోనూ నాలుగైదు సినిమాలు చేస్తోంది. అంతేకాదు… బ్యాక్ అటు బ్యాక్ రెండు వెబ్ సీరిస్ లకు పచ్చజెండా ఊపేసిన విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ -2' తో సమంతను వెబ్ సీరిస్ కు పరిచయం చేసిన…
(జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు)“ఎక్కడ పారేసుకుంటామో, అక్కడే వెదకాలి” అంటారు పెద్దలు. గోపీచంద్ మనసు చిత్రసీమలో పారేసుకున్నాడు. కాబట్టి, అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించాడు. చివరకు అనుకున్నది సాధించి, హీరోగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మాస్ హీరోగా పలు చిత్రాలలో జనాన్ని అలరించిన గోపీచంద్, ఓ నాటి ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడు! టి.కృష్ణ దర్శకత్వంలో అనేక అభ్యుదయభావాలతో చిత్రాలు రూపొంది విజయం సాధించాయి. వాటిలో ‘ప్రతిఘటన’ చిత్రం మరపురానిది. గోపీచంద్ అన్న ప్రేమ్…
రేపు టాలీవుడ్ హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ‘పక్కా కమర్షియల్’ నుంచి అట్రాక్టివ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. గోపీచంద్ లాయర్ పాత్రలో నటిస్తుండగా.. తాజా పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తీర్చిదిద్దుతున్నాడు. గోపీచంద్ సరసన రాశిఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 బ్యానర్లపై రూపొందుతోంది. బన్నీ వాస్ నిర్మాతగా…
మాచో హీరో గోపీచంద్, ప్రముఖ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా “పక్కా కమర్షియల్”. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపిచంద్ 29వ సినిమాగా రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగులన్నీ…