Pakistan: పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ క్రూరంగా కాల్చి చంపింది. ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే, బలూచిస్తాన్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే, బలూచ్ ప్రజలు తమకు స్వాతంత్య్రం కావాలని నినదిస్తున్నారు. ఇందుకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ సైనికులు, అధికారులే టార్గెట్‌గా దాడులకు పాల్పడుతుంది.
ఇదిలా ఉంటే, శుక్రవారం బలూచిస్తాన్‌లో శక్తివంతమైన పేలుడులో ఏడుగురు పాక్ సైనికులు హతమయ్యారు. రోడ్డు పక్కన బాంబు పేలడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఏగుగురు పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. బలూచ్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది మేమే అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది.
Read Also: Waqf Act: “వక్ఫ్ బిల్లుపై స్టేకి వ్యతిరేకంగా”.. సుప్రీంకోర్టులో చట్టాన్ని సమర్థించిన కేంద్రం..
మరోవైపు, బలూచ్ ప్రజల కోసం ఉద్యమిస్తున్న వారిని పాక్ ప్రభుత్వం క్రూరంగా హింసించడం, జైలులో పెట్టడం, ప్రజల్ని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేస్తున్న ఘటనలకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ వ్యాప్తంగా బలూచి యాక్జెహ్తి కమిటీ (BYC) శుక్రవారం భారీ నిరసనలకు ప్రకటించింది. తుర్బాట్, పంజ్‌గూర్, నొకుండి, దల్బందిన్, యక్మాచ్, చార్సర్, మష్ఖేల్, ఓర్మాగే, చాఘి, అమీనాబాద్, ఖరన్, కరాచీ, ఉతల్, గదాని, నుష్కి, కలాట్ మరియు మస్తుంగ్ వంటి వివిధ నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి.
క్వెట్టాలోని హుడా జైలులో బలూచ్ ఉద్యమకారుల్ని పాక్ భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో మహరంగ్ బలోచ్, బెబార్గ్ బలోచ్, గుల్జాది బలోచ్ మరియు బీబో బలోచ్ ఉన్నారు.