ఆఫ్ఘనిస్థాన్‌పై మరోసారి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10 మంది చనిపోగా.. నలుగురు గాయపడినట్లుగా ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఖోస్ట్ ప్రావిన్స్‌లోని గోర్బుజ్ జిల్లాలో దాడి జరిగినట్లుగా ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం తెలిపారు. 9 మంది పిల్లలు చనిపోయినట్లుగా పేర్కొన్నారు. అనంతరం చికిత్స పొందుతూ మహిళ కూడా చనిపోయినట్లుగా వెల్లడించారు. మొత్తంగా 10 మంది చనిపోయినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
అలాగే కునార్, పాక్టికాలో వైమానిక దాడులు జరిగాయని.. ఇక్కడ నలుగురు పౌరులు గాయపడినట్లు తెలిపారు. తాజా దాడుల నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్‌లో అమెరికా మాజీ రాయబారి జల్మయ్ ఖలీల్దాద్ దౌత్యానికి పిలుపునిచ్చారు. ఇక ఇరు దేశాల మధ్య సయోధ్య కోసం టర్కీకి చెందిన ఒక బృందం ఇస్లామాబాద్, కాబూల్‌లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi-Ayodhya: అయోధ్య రామాలయంపై కాషాయ జెండా ఆవిష్కరించిన మోడీ
గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఈ మధ్య ఆప్ఘనిస్థాన్.. భారత్‌తో సఖ్యతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆప్ఘనిస్థాన్‌పై వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది.
Last night at around 12 o’clock in the Gorbuz district of Khost province, in the Mughalgai area, the Pakistani invading forces bombed the house of a local civilian resident, Waliat Khan, son of Qazi Mir. As a result, nine children (five boys and four girls)
21— Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) November 25, 2025
There are reports of multiple attacks by Pakistan in Afghanistan's Khost, Kunar, and Paktika provinces tonight. According to Initial report in Khost's Mughulgai area 9 children and one woman were killed. In Kunar and Paktika initial reports allege 4 civilians were injured.
I…— Zalmay Khalilzad (@realZalmayMK) November 25, 2025