Hindu man abducted in pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే హిందూ బాలికలు అపహరించి బలవంతంగా ముస్లీం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేసి మతం మారుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పాక్ లోని సింధ్ ప్రావిన్సుల్లో వందల సంఖ్యలో జరిగాయి.
Javed Miandad: పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారాలుమిరియాలు నూరుతోంది. పాక్ మాజీ ఆటగాళ్లు భారత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని పాక్ మాజీ ఆటగాడు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.
దాయాది దేశం పాకిస్థాన్ మాట మార్చింది. భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడడానికి.. ఆ దేశ క్రికెట్ బోర్డు వేదికలను ఎంపిక చేసుకుంటుంది. ఇండియాలోని 12 నగరాల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీలో భద్రతా కారణాల దృష్ట్యా తాము చెన్నై, కోల్ కతా వేదికల్లోనే అన్ని మ్యాచ్ లు ఆడతామని పాకిస్థాన్ చెబుతుంది.
దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులకు అంతర్జాతీయ సరిహద్దుల గుండా పాకిస్థాన్ ఆయుధాలు పంపడాన్ని అంతర్జాతీయంగా ఖండించాలని భారత్ పిలుపునిచ్చింది. డ్రోన్లను ఉపయోగించి అక్రమ ఆయుధాల సరఫరాను సీమాంతరంగా సరఫరా చేయడంలో తాము తీవ్రమైన సవాలును ఎదుర్కొంటున్నామని భద్రతా మండలికి భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. తాము కూడా భారత్ లానే రష్యా నుంచి చౌకగా క్రూడ్ ఆయిల్ ని పొందాలని కోరుకుంటున్నామని చెప్పారు. కానీ తన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కూలిపోవడంతో అలా చేయలేకపోయామని చెప్పారు.
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అక్కడ ప్రజలు రోజూ గోధుమ పిండి కోసం పెద్ద యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఆహారం కోసం జరిగిన తొక్కిసలాటల్లో 20 మందికి పైగా ప్రజలు చనిపోయారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. మరోవైపు పాకిస్తాన్ కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఐఎంఎఫ్ 1.1 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తోంది. ఇక మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను సాధిస్తోందని, ప్రపంచం దేశం వైపు చూస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతోంది. ఆ దేశానికి మిత్రదేశాలతో పాటు ఐఎంఎఫ్ వద్ద అప్పు పుట్టడం లేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక వేళ ఎంత ధర పెట్టి కొందాం అని అనుకున్న మార్కెట్లలో సరుకులు లభించడం లేదు. గోధుమ పిండి కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గోధుమ కోసం అక్కడి ప్రజలు ఓ యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే గోధుమ పిండి కేంద్రాల…
Suella Braverman: బ్రిటిష్ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అక్కడ ‘‘గ్రూమింగ్ గ్యాంగులు’’ రెచ్చిపోతున్నాయి. టీనేజ్ అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న గ్యాంగులను అణిచివేస్తానని గతేడాది జరిగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ప్రధాన హమీల్లో ఒకటిగా ఉంది. తాజాగా బ్రిటన్ హోం మినిస్టర్ సువెల్ల బ్రావెర్ మాన్ ఇంగ్లీష్ అమ్మాయిలపై వేధింపుకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.