Pakistan: పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా నెమ్మదిగా ఆ దేశంలో తమ వ్యాపారాలను మూసేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి, ఉగ్రవాదం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై తరుచుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, పాక్ తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులు భయంతో పనులు చేస్తున్నారు. చివరకు చైనా తమ పౌరులు సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని…
Pakistan: పాకిస్తాన్ తో పాటు ఇతర ఇస్లామిక్ దేశాల్లో ‘‘దైవదూషణ’’కు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. మరణశిక్షలు విధించిన సందర్భాలు ఎక్కువ. పాకిస్తాన్ వంటి దేశాల్లో అయితే ఎలాంటి అనుమానం ఉన్నా కూడా దైవదూషణ వంటి కేసుల్లో మతోన్మాదులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జరిగాయి. 2021లో ఓ శ్రీలంక జాతీయుడిని దైవదూషణ పేరుతో ప్రజలే నిప్పంటించి కాల్చి చంపారు. దీని తర్వాత ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్…
Pakistan : గత కొద్ది రోజులుగా ఆర్థిక సంక్షోభంతో కూరుకున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. పాకిస్థాన్ మత వ్యవహారాల శాఖ మంత్రి ముఫ్తీ అబ్దుల్ షాకూర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ టీ20ల్లో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లాహోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో అత్యధిక విజయాలు (42) సాధించిన బాబర్ నిలిచాడు.
Imran Khan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది. అక్కడి జనాలకు తినడానికి తిండి కరువైంది. విదేశీమారక నిల్వలు లేక దిగుమతులు చేసుకోలేని పరిస్థితి. అరబ్ దేశాలు, ఆల్ టైం ఫ్రెండ్ చైనా కూడా పెద్దగా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో పాక్ ప్రభుత్వం,
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీల వివాహ వేడుకను ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం నిర్వహించలేదని పాక్ మతపెద్ద ముఫ్తీ మహ్మద్ సయీద్ అన్నారు. 2018లో ఈ జంట ఇస్లామిక్ వివాహం జరిపించిన మతగురువులు, ఇది బుష్రా బీబీ ఇద్దత్ కాలంలో జరిగిందని చెప్పారు.
పాకిస్థాన్ లో జీవించడం అంటే జైలు జీవితంతో సమానం అనే వ్యాఖ్యలను సైమన్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ.. క్రికెటర్ అమీర్ సైహైల్, సైమన్ డౌల్ మధ్య పెద్ద వివాదమే నడిచింది.
Atiq Ahmed: గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ పోలీసుకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాడు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను ప్రయాగ్‌రాజ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.
Pakistan: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితులు ఇతర దేశాలను కూడా భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ దేశంలో స్వీడన్ తన రాయబార కార్యాలయాన్ని నిరవధికంగా మూసేసింది. వీసాలు, ఇతర దౌత్యసంబంధాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా కూడా ఇతర దేశాలు నమ్మడం లేదు. ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణం కావచ్చని తెలుస్తోంది.
S Jaishankar: భారతదేశాన్ని ఇరకాలంలో పెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా చీటికి మాటికి సరిహద్దు వివాదాలు, సీమాంతర ఉగ్రవాదాలను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాక్ లను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది విభిన్న భారతదేశం అని, దేశ భద్రతకు ముప్పు వస్తే వారికి గట్టి బదులిస్తాం అంటూ