Babar Azam: మళ్లీ అతని చేతికే జట్టు పగ్గాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌కు మళ్లీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పీసీబీ (Pakisthan Cricket Board). వన్డే వరల్డ్ కప్ తర్వాత బాబర్ ఆజం.. పాకిస్థాన్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత.. అతని స్థానంలో టీ20లకు షహీన్ అఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్‌ను కెప్టెన్లుగా పీసీబీ నియమించింది.
అయితే.. వారిని నియమించిన తర్వాత అనుకున్నంత స్థాయిలో జట్టుకు విజయాలు లేకపోవడం, రాణించకపోవడంతో మళ్లీ బాబర్ వైపు చూసింది. ఈ క్రమంలో.. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు బాబర్ అజామ్‌ను తిరిగి నియమించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు పీసీబీ కీలక ప్రకటన జారీ చేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం మేరకు.. బాబర్ అజామ్‌కు మళ్లీ పరిమిత ఓవర్ల జట్టు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వీ తెలిపారు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాక్ 1-4 తేడాతో కోల్పోయింది. అప్పుడు పాక్ కెప్టెన్ గా షహీన్ బాధ్యతలు వహించాడు. కాగా.. కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాస్త సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని తన అల్లుడు షహీన్‌ను షాహిద్ వెనుకేసుకొచ్చాడు. కాగా.. ఇప్పుడు షహీన్‌ను తప్పించి మళ్లీ బాబర్‌కే బాధ్యతలు అప్పజెప్పింది. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అయితే.. జూన్ 9న ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
- Tags
- Babar Azam
- captain
- cricket
- Pakistan
- pcb
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..