Kamran Ghulam: క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టు ప్రత్యేకమైన విధానం కలిగి ఉంటుందని అనడంలో ఎతువంటి అతిశయోక్తి లేదు. ఆటలోనే కాదు, ఆటగాళ్ల ప్రవర్తనలోనూ పాక్ జట్టు ఎప్పటికప్పుడు వివాదాల కేంద్రంగా నిలుస్తోంది. ప్రత్యర్థి జట్లతో స్లెడ్జింగ్ చేయడం, నోటిదూల ప్రదర్శించడం లాంటివి పాక్ ప్లేయర్లకు కొత్తేమీ కాదు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ కమ్రాన్ గులాం తన అసభ్య ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నేడు సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ సమయంలో పాక్…
పాకిస్థాన్ క్రికెట్లో గందరగోళం నెలకొటోంది. ఇటీవల బాబర్ ఆజం వైట్‌బాల్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సెలక్షన్ కమిటీలో సైతం మార్పులు జరిగాయి. తాజాగా ఇప్పుడు 2011లో భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
Noman Ali fires Pakistan to Crushing win vs England: చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై పాకిస్తాన్ టెస్టు విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో గెలిచింది. పాక్ నిర్దేశించిన 297 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 144 పరుగులకే ఆలౌటైంది. పాక్ స్పిన్నర్లు నొమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) దెబ్బకు ఇంగ్లండ్ కుదేలైంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 366 రన్స్ చేయగా.. ఇంగ్లండ్…
Pakistan Win against England in Multan: పాకిస్థాన్ క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సొంతగడ్డపై ఎట్టకేలకు టెస్టు విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. దాంతో 1338 రోజుల నిరీక్షణకు తెరపడింది. స్వదేశంలో 11 మ్యాచుల అనంతరం తొలి గెలుపు దక్కడంతో పాక్ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరగా పాక్ స్వదేశంలో…
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ టీమ్ హవా నడించింది. సొంతగడ్డపైనే కాక.. విదేశాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. 1992లో వన్డే ప్రపంచకప్, 2009లో టీ20 ప్రపంచకప్‌లను గెలిచింది. అలాంటి టీమ్ ప్రస్తుతం అనూహ్య ఓటములను ఎదుర్కొంటోంది. పసికూనల చేతుల్లో కూడా ఓడిపోతోంది. ఘన ప్రస్థానం నుంచి.. పాకిస్తాన్ పతనం వైపు వేగంగా అడుగులేస్తోందా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ ఆట తీరు రోజురోజుకు పడిపోతోంది. టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో ఓడిన పాక్.. టీ20 ప్రపంచకప్…
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో పేలవ ప్రదర్శన చేసిన బాబర్ అజామ్, షహీన్ అఫ్రీది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లపై వేటు పడింది. ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్ట్‌ల కోసం పీసీబీ ప్రకటించిన జట్టులో వీరికి చోటు దక్కలేదు. పీసీబీ నిర్ణయంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ తాజాగా స్పందించాడు. బాసిత్…
Basit Ali About Bangladesh Team: ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై ఓడించి.. టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా.. అదే జోష్‌తో భారత పర్యటనకు వచ్చి చతికిల పడింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన బంగ్లాదేశ్.. టీ20ల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లోనూ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో బంగ్లాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చురకలు అంటించాడు.…
2007 September 24 is Special Day For Team India: 2007 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే బంగ్లాదేశ్‌తో చేతిలో ఓడిన భారత జట్టు.. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని యువ భారత జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రపంచంలో మేటి…
ICC Test Rankings-Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయిన పాక్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ల్లోనూ కిందకు పడిపోయింది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ మెన్స్ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను కోల్పోయిన పాక్ 8వ స్థానానికి పడిపోయింది. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉంది. ఛాంపియన్షిప్ పట్టిక, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సైతం 8వ…
Pakistan Cricket Worst Record on Home Soil: బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. పాక్‌పై రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌కు ముందు పాక్‌పై టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని బంగ్లా ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్‌ను దాని సొంతగడ్డపై 2-0తో చిత్తు చేసింది. తొలిసారి పాక్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టుపై…