PAK vs SL T20: జనవరి 7 నుంచి 11వ తేదీ వరకు శ్రీలంకలో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు కొత్త ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది.
పాకిస్థాన్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో అఫ్రిది ఐదు వికెట్స్ పడగొట్టి ఈ ఘటన అందుకున్నాడు. 38 సంవత్సరాల 301 రోజుల వయసున్న ఆసిఫ్.. అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా 92 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ రికార్డు ఇంతకుముందు ఇంగ్లండ్‌కు బౌలర్ ఛార్లెస్ మారియట్ పేరిట ఉంది. వెస్టిండీస్‌పై…
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా పాకిస్థాన్ జట్టు తన తొలి సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. లాహోర్ వేదికగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజే పాకిస్థాన్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా కెప్టెన్ షాన్ మసూద్ (76), ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) అద్భుత హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 25 ఏళ్ల నాటి అరుదైన రికార్డును సమం చేశారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కేవలం…
ఆసియా కప్ 2025లో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండో-పాక్ కరచాలన వివాదానికి బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తప్పించాలన్న తమ డిమాండ్‌కు ఐసీసీ అంగీకరించకపోవడంతో.. యూఏఈ మ్యాచ్‌ను బహిష్కరించడానికి పాక్ సిద్ధమైంది. హై డ్రామా తర్వాత రిఫరీ ఆండీ తమ జట్టుకు క్షమాపణ చెప్పినట్లు పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంటనే…
Pakistan vs West Indies: వెస్టిండీస్ జట్టు రికార్డు సృష్టించింది. వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి 34 ఏళ్ల పగను తీర్చుకుంది. 1991 తర్వాత పాక్ పై వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Pakistan Cricketer Haider Ali Arrested Over Rape Allegations: పాకిస్తాన్ క్రికెట్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. వివాదాలు, లైంగిక వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పాక్ క్రికెటర్స్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్.. లాంటి స్టార్స్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిపై అత్యాచారం కేసులో పాక్ యువ ఆటగాడు హైదర్ అలీ అరెస్ట్ అయ్యాడు.…
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారతీయులు పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సిగ్గుచేటు పని చేశాడు. పహల్గామ్ దాడిపై రక్తం మరిగే వ్యాఖ్యలు చేశాడు. ఉగ్ర దాడిని ఖండించడానికి బదులుగా, అఫ్రిది భారతదేశాన్ని ఆధారాలు అందించమని కోరాడు. వైరల్ అయిన ఓ…
పాకిస్తాన్‌కు చెందిన ఆరేళ్ల బాలిక సోనియా ఖాన్.. తన అద్భుతమైన క్రికెట్ ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లాస్టిక్ బంతితో ఆమె ప్రాక్టీస్ షాట్లు చూస్తే.. క్రికెట్ అభిమానులు బాలికపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను పట్టుకున్న క్యాచ్ చూసి అభిమానులు, సహచర ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.