ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శన, వ్యూహం రెండింటిలోనూ విఫలమైంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఐడియాలు పని చేయలేదు. కాగా.. పాకిస్తాన్ కెప్టెన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రిజ్వాన్ మ్యాచ్ సమయంలో 'తస్బీహ్' ప్రార్థన పూసలు పట్టుకుని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు.. క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై భారత్ అద్భుతమైన రికార్డును కొనసాగిస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా విక్టరీతో మొదలు పెట్టింది. టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా.. భారత్ తన రెండవ మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులతో పాటు.. ఇతర దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. అతను ఫీల్డింగ్ చేస్తుండగా గాయమైంది. దీంతో.. దుబాయ్‌లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు అతను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దూరమయ్యాడు. ఈ క్రమంలో.. ఫఖర్ స్థానంలో ఇమామ్-ఉల్-హక్‌ను జట్టులోకి తీసుకున్నారు.
పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బుధవారం కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నమెంట్-ఓపెనర్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్‌కు ఐసిసి జరిమానా విధించింది.
సొంతగడ్డపై జరుగుతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు మంచి ఆరంభం లభించలేదు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవి చూసింది. మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బ్యాటర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.
కరాచీలో బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 100 అర్ధ సెంచరీలు సాధించిన రెండవ పాకిస్తానీ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో.. బాబర్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. 2015 మే 31న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్.. ఇప్పటి వరకు 59 టెస్టుల్లో 29 హాఫ్ సెంచరీలు, 127 వన్డేల్లో 35 హాఫ్ సెంచరీలు, 128 టీ20ల్లో 36 హాఫ్ సెంచరీలు సాధించాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వివరణ ఇచ్చింది. ఈ టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలను స్టేడియం పైకప్పుపై ఎగురవేస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్ పై పొగడతల వర్షం కురిపించాడు. పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్ అని రషీద్ లతీఫ్ అభివర్ణించారు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాలో ఫాలో ఆన్ ఆడి అత్యధిక పరుగులు చేసిన తొలి పర్యాటక జట్టుగా పాక్ చరిత్రకెక్కింది. గత 136 ఏళ్లలో దక్షిణాఫ్రికాలో ఓ విజిటింగ్ టీమ్ ఫాలో ఆన్ ఆడి.. 400 పరుగులకు పైగా చేయడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో 122 సంవత్సరాల క్రితం జోహన్నెస్‌బర్గ్‌లో 1902లో ఆస్ట్రేలియా నెలకొల్పిన రికార్డును పాక్ బద్దలు కొట్టింది. దక్షిణాఫ్రికాలో 1902లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్…