పాకిస్థాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్ (నవంబర్ 11) పూర్తయింది. రావల్పిండిలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాక్ గెలిచింది. రావల్పిండిలోనే రెండో, మూడో వన్డేలు జరగనున్నాయి. మొదటి వన్డే జరిగిన రోజే ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందారు. ఇస్లామాబాద్‌కు చాలా దగ్గర్లోనే రావల్పిండి ఉండడంతో శ్రీలంక ప్లేయర్స్ భయాందోళనకు గురయ్యారు. పాకిస్థాన్‌లో భద్రతపై ఆందోళన చెందిన లంక ప్లేయర్స్ సిరీస్ ఆడలేమని స్పష్టం చేశారట. రావల్పిండికి…
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు సత్తాచాటారు. షాహీన్ అఫ్రిది 3, హుస్సేన్ తలత్ 2 వికెట్స్ తీయడంతో లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 రన్స్ మాత్రమే చేసింది. కమిండు మెండిస్ (50; 44 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో చమిక కరుణరత్నే (17), వానిండు హసరంగా (15) రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేసింది.…
Naseem Shah Likely to Miss ODI World Cup 2023: ఆసియా కప్ 2023 టైటిల్ కొడుదామనుకున్న పాకిస్తాన్‌కు ఊహించని పరాయజం ఎదురైన విషయం తెలిసిందే. సూపర్-4లో శ్రీలంకతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలై.. ఇంటిబాట పట్టింది. ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు.. వన్డే ప్రపంచకప్ 2023కి ముందు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా యువ పేసర్ నసీమ్ షా మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్-4లో భాగంగా…
Pakistan Captain Babar Azam React on Defeat vs Sri Lanka in Asia Cup 2023: ఫైనల్ ఓవర్‌ను జమాన్ ఖాన్‌తో వేయించడం వర్కౌట్ కాలేదు అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చెప్పాడు. కుశాల్ మెండీస్, సదీర సమరవిక్రమా భాగస్వామ్యం తమను దెబ్బతీసిందని తెలిపాడు. ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఓడిన పాకిస్థాన్ ఫైనల్స్‌లో అడుగుపెట్టలేదు. వర్షం కారణంగా 42 ఓవర్లకు…
Sri Lanka Enters Asia Cup 2023 Final after defeat Pakistan: గురువారం హోరాహోరీగా సాగిన ఆసియా కప్ 2023 ‘సూపర్-4’ మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. డక్‌వర్త్-లూయిస్ విధానంలో లక్ష్యాన్ని 42 ఓవర్లలో 252 పరుగులకు సవరించగా.. శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (91; 87 బంతుల్లో 8×4, 1×6), అసలంక (49 నాటౌట్; 47 బంతుల్లో 3×4,…
Missing Naseem Shah a big blow Says Pakistan Bowling Coach Morne Morkel: ఆసియా కప్ 2023 గ్రూప్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. భారత్ నిర్ధేశించిన 357 పరుగుల లక్ష్య ఛేదనలో 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయి.. ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 2 వికెట్ల నష్టానికి 356 ట్రాన్స్ చేసింది. భారత…
India vs Pakistan will not play Final in Asia Cup: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు నేడు తలపడుతున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్‌కి చేరుతుంది. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. సూపర్-4 రౌండ్‌లో పాకిస్తాన్, శ్రీలంకపై గెలిచిన భారత్.. ఇప్పటికే టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. నేటి పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌లో గెలిచిన జట్టు…
PAK vs SL Match Asia Cup 2023 Super Fours Today: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్, శ్రీలంక నేడు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను ఢీ కొడుతుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కి చేరాలని ఇరు జట్లు చూస్తున్నాయి. రెండు జట్లకు…