PAK vs SL: భారత్‌తో మ్యాచ్ తర్వాత బాగా నిరుత్సాహ పడ్డాం: మోర్నే మోర్కెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing Naseem Shah a big blow Says Pakistan Bowling Coach Morne Morkel: ఆసియా కప్ 2023 గ్రూప్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. భారత్ నిర్ధేశించిన 357 పరుగుల లక్ష్య ఛేదనలో 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయి.. ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 2 వికెట్ల నష్టానికి 356 ట్రాన్స్ చేసింది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ (122 నాటౌట్; 94 బంతుల్లో 9×4, 3×6), కేఎల్ రాహుల్ (111 నాటౌట్; 106 బంతుల్లో 12×4, 2×6) సెంచరీలతో చెలరేగగా పాక్ స్పిన్నర్లు తేలిపోయారు. ఈ ఓటమిపై పాక్ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పందించాడు. భారత్‌తో మ్యాచ్ తర్వాత తాము నిరుత్సాహ పడ్డాం అని తెలిపాడు.
తమ స్పిన్నర్లు శ్రీలంకతో మ్యాచ్‌లో పుంజుకొంటారని మోర్నే మోర్కెల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు మోర్కెల్ మాట్లాడుతూ… ‘కొలంబో మైదానంలో పరిస్థితులు స్పిన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మా స్పిన్నర్లు బాగా రాణిస్తారని భావిస్తున్నా. జట్టుకు అవసరం ఉన్నప్పుడు బాధ్యతలు స్వీకరించడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందరూ మ్యాచ్ విన్నర్లు కాబట్టి.. ఎలా పుంజుకోవాలో వారికి బాగా తెలుసు. భారత్‌తో మ్యాచ్ తర్వాత మేం బాగా నిరుత్సాహ పడ్డాం. బౌలర్లు ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరం. ఎక్కడ తప్పుచేశారో తెలుసుకొని ముందుకువెళ్లాలి. భారత బ్యాటర్లకే పూర్తి క్రెడిట్ దక్కుతుంది. ప్రపంచకప్‌నకు ముందు ఇది మాకో గుణపాఠం నేర్పింది’ అని తెలిపాడు.
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
Also Read: iPhone 15 Price: ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చిన యాపిల్!
‘శ్రీలంకతో మ్యాచ్‌కు స్టార్‌పేసర్ నసీమ్ షా అందుబాటులో లేకపోవడం మాకు పెద్ద ఎదురు దెబ్బే. అయితే కొత్తగా జట్టులోకి వచ్చే వారికి ఇదో అద్భుతమైన అవకాశం. వారు రాణిస్తారనే నమ్మకం ఉంది. భారత్ చేతిలో ఓడిపోవడంతో.. ఫైనల్ చేరాలంటే శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ప్లేయర్స్ ఎలా ఆడతారో చూడాలని ఉత్కంఠగా ఉంది’ అని పాక్ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అన్నాడు. నసీమ్ షా స్థానంలో యువ బౌలర్ జమాన్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. అతడు నేటి మ్యాచ్ ఆడనున్నాడు. కొలంబోని ప్రేమదాస మైదానంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!