PAK vs SL: ఆకాష్ చెప్పినట్టే సూపర్-4 మ్యాచ్‌లో పాక్ ఓటమి.. ఆసియా కప్ ఫైనల్‌కు శ్రీలంక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka Enters Asia Cup 2023 Final after defeat Pakistan: గురువారం హోరాహోరీగా సాగిన ఆసియా కప్ 2023 ‘సూపర్-4’ మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. డక్‌వర్త్-లూయిస్ విధానంలో లక్ష్యాన్ని 42 ఓవర్లలో 252 పరుగులకు సవరించగా.. శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (91; 87 బంతుల్లో 8×4, 1×6), అసలంక (49 నాటౌట్; 47 బంతుల్లో 3×4, 1×6) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌ను శ్రీలంక ఢీ కొడుతుంది.
వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయింది. వర్షం తగ్గాక అంపైర్లు ఓవర్లను కుదించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (86 నాటౌట్; 73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ ( 52; 69 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇఫ్తికార్ అహ్మద్ (47; 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఓ దశలో పాక్ 130కే 5 వికెట్స్ కోల్పోగా.. రిజ్వాన్, ఇఫ్తికార్ ఆరో వికెట్‌కు 108 పరుగులు జోడించి ఆదుకున్నారు. దాంతో పాక్ మెరుగైన స్కోర్ చేసింది. పతిరన మూడు వికెట్లు తీయగా.. ప్రమోద్ మదుశాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అనంతరం శ్రీలంక లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ ద్వారా 42 ఓవర్లలో 252 పరుగులుగా అంపైర్లు నిర్దేశించారు. లంక 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి 252 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ (48; 51 బంతుల్లో 4 ఫోర్లు), అసలంక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి ఓవర్లో లంకకు 8 పరుగులు అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. నాలుగో బంతికి మదుశాన్ రనౌటయ్యాడు. ఐదవ బంతికి అసలంక ఫోర్ కొట్టి ఉత్కంఠకు కాస్త తెరదించాడు. ఇక చివరి బంతికి అసలంక 2 పరుగులు తీయడంతో లంక సంబరాల్లో మునిగిపోయింది.
Also Read: Astalakshmi Stotram: ఈ స్తోత్రాలు వింటే రుణబాధలతో పాటు, కష్టాలు తొలగిపోతాయి
ఈ విజయంతో శ్రీలంక 4 పాయింట్లతో సూపర్-4 దశలో రెండో స్థానంలో నిలిచి.. ఆసియా కప్ 2023 ఫైనల్ చేరింది. సూపర్-4 ఆడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ నిష్క్రమించాయి. ఈ టోర్నీలో 11వ సారి లంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్, శ్రీలంకపై గెలిచిన భారత్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఇక నేడు బంగ్లాతో రోహిత్ సేన నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. భారత్-పాకిస్తాన్ ఫైనల్లో తలపడటం ఆసియా కప్ చరిత్రలోనే లేదని, ఈసారి కూడా అదే జరుగుతుందని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా చేపినట్టే జరిగింది.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!