PAK vs SL: నేడు పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్.. భారత్‌ను ఢీకొట్టేదెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAK vs SL Match Asia Cup 2023 Super Fours Today: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్, శ్రీలంక నేడు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను ఢీ కొడుతుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కి చేరాలని ఇరు జట్లు చూస్తున్నాయి. రెండు జట్లకు ‘డూ ఆర్ డై’ అయిన ఈ మ్యాచ్‌కి వర్ఫం ముప్పు కూడా పొంచి ఉండడం గమనార్హం.
బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. పాక్‌కు ఆటగాళ్ల గాయాలు సమస్యగా మారడంతో లంకతో మ్యాచ్ కోసం ఏకంగా 5 మార్పులు చేసింది. భారత్‌తో మ్యాచ్‌లో నసీమ్ షా, హారిస్ రవూఫ్, సల్మాన్ అఘా గాయపడ్డారు. నసీమ్ టోర్నీ మొత్తానికే దూరమవగా.. లంక మ్యాచ్‌లో హారిస్ రవూఫ్ ఆడడం లేదు. ఈ ఇద్దరి స్థానాల్లో జమాన్ ఖాన్, మహమ్మద్ వసీం ఆడుతున్నారు. సల్మాన్ స్థానాన్ని షకీల్ భర్తీ చేశాడు. ఫకర్ జమాన్, ఫహీం అష్రఫ్ స్థానాల్లో హారిస్, నవాజ్ బరిలోకి దిగనున్నారు. పాక్ బ్యాటింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇమాముల్, ఆజామ్ పైనే పాక్ ఆశలు పెట్టుకుంది.
Also Read
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
భారత్‌తో పోరులో విజయం కోసం లంక బాగానే పోరాడింది. అదే ఉత్సాహంతో పాక్‌ను ఓడించాలని చూస్తోంది. గాయాలతో హసరంగ, చమీర, లాహిరు కుమార లాంటి స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన లంక.. బాగానే రాణిస్తోంది. యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగె భారత బ్యాటర్లను కట్టడి చేయడం లంకకు కలిసొచ్చే అంశం. పతిరన, తీక్షణ, అసలంకతో లంక బౌలింగ్ బలంగానే ఉంది. అయితే బ్యాటింగ్ విభాగమే పుంజుకోవాల్సి ఉంది. టాప్ ఆర్డర్ రాణిస్తే గాయాలతో సతమతం అవుతున్న పాక్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.
Also Read: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
తుది జట్లు (అంచనా) (PAK vs SL Playing 11):
పాకిస్థాన్: బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ హారీస్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ రిజ్వాన్ (కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, షాహీన్ ఆఫ్రిది, జమాన్ ఖాన్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.
తాజావార్తలు
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!