Babar Azam: దురదృష్టవశాత్తు అది వర్కౌట్ కాలేదు.. మా ఓటమికి కారణం ఆ ఇద్దరే: బాబర్ ఆజామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Captain Babar Azam React on Defeat vs Sri Lanka in Asia Cup 2023: ఫైనల్ ఓవర్‌ను జమాన్ ఖాన్‌తో వేయించడం వర్కౌట్ కాలేదు అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చెప్పాడు. కుశాల్ మెండీస్, సదీర సమరవిక్రమా భాగస్వామ్యం తమను దెబ్బతీసిందని తెలిపాడు. ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఓడిన పాకిస్థాన్ ఫైనల్స్‌లో అడుగుపెట్టలేదు. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో లంక చివరి బంతికి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ ఓటమిపై స్పందించాడు.
‘చివరి ఓవర్లను మా అత్యుత్తమ బౌలర్లతో బౌలింగ్ చేయించాలని నిర్ణయించుకున్నాము. అందుకే 47వ ఓవర్‌ను షాహీన్ ఆఫ్రిది వేశాడు. చివరి ఓవర్ వేసే జమాన్ ఖాన్‌పై నమ్మకం ఉంచాం. దురదృష్టవశాత్తు అది వర్కౌట్ కాలేదు. శ్రీలంక బాగా ఆడింది. వారు మాకంటే బాగా క్రికెట్ ఆడారు.. అందుకే గెలిచారు. మేము మా బౌలింగ్, ఫీల్డింగ్‌లో వెనకపడిపోయాం. అందుకే ఓడిపోయాం. మిడిల్ ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం మా ఓటమిని శాసించింది’ అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: IND vs BAN: బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అవుట్! శ్రేయస్, సూర్య ఇన్
‘కుశాల్ మెండీస్, సమరవిక్రమా భాగస్వామ్యం మమ్మల్ని దెబ్బతీసింది. మేము బాగా స్టార్ట్ చేస్తున్నాం, బాగా ఫినిష్ చేస్తున్నాం. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం లేదు. అదే మా జట్టు ఓటమికి కారణం అవుతొంది’ అని బాబర్ ఆజామ్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్ (86 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 58) రెండు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ తీక్షణ, దునీత్ వెల్లలాగే(1/40)లకు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య చేధనలో శ్రీలంక 42 ఓవర్లలో 252 పరుగులే చేసి గెలుపొందింది. కుశాల్ మెండీస్ (91), సమరవిక్రమా (48), చరిత్ అసలంక(49 నాటౌట్) రాణించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!