PAK vs SL: భయంగా ఉంది.. పాక్ నుంచి స్వదేశానికి శ్రీలంక ప్లేయర్స్!
- పాకిస్థాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్
- ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడుతో 12 మంది మృతి
- పాక్ నుంచి స్వదేశానికి శ్రీలంక ప్లేయర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్ (నవంబర్ 11) పూర్తయింది. రావల్పిండిలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాక్ గెలిచింది. రావల్పిండిలోనే రెండో, మూడో వన్డేలు జరగనున్నాయి. మొదటి వన్డే జరిగిన రోజే ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందారు. ఇస్లామాబాద్‌కు చాలా దగ్గర్లోనే రావల్పిండి ఉండడంతో శ్రీలంక ప్లేయర్స్ భయాందోళనకు గురయ్యారు. పాకిస్థాన్‌లో భద్రతపై ఆందోళన చెందిన లంక ప్లేయర్స్ సిరీస్ ఆడలేమని స్పష్టం చేశారట.
రావల్పిండికి బాంబ్ దాడి జరిగిన ఇస్లామాబాద్ సమీపంలోనే ఉందని, భద్రతపై తమ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారని ఓ శ్రీలంక బోర్డు అధికారి చెప్పాడు. దాంతో పాకిస్థాన్, శ్రీలంక సిరీస్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంక జట్టులోని 8 మంది ప్లేయర్స్ నేడు స్వదేశానికి బయల్దేరనున్నారు. వన్డే సిరీస్ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్, జింబాబ్వే మధ్య ముక్కోణపు సిరీస్ ఉంది. ఈ సిరీస్ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. రెండు సిరీస్‌లు రద్దయితే పీసీబీకి భారీ నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పీసీబీ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారనుంది.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
2009లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్ర వాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఆ ఘటనలో ప్లేయర్స్ ప్రాణాలతో భయపడ్డారు. మహేల జయవర్దనే, చమింద వాస్, అజంత మెండిస్, కుమార్ సంగక్కర, తిలకరత్నే దిల్షాన్ సహా మరికొందరు గాయపడ్డారు. ఆ ఘటనలో భద్రత సిబ్బంది చాలా మంది మృతి చెందారు. భద్రత సిబ్బంది ప్రతిఘటించడంతో ప్లేయర్స్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ దాడితో దాదాపు దశాబ్దం పాటు విదేశీ జట్లు పాకిస్థాన్‌కు క్రికెట్ ఆడేందుకు వెళ్లలేదు. 2019లో శ్రీలంక జట్టే పాకిస్థాన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి అన్ని టీమ్స్ పాక్ వెళ్లి ఆడాయి. తాజా ఘటనతో మరలా అప్పటి పరిస్థితే వచ్చే అవకాశాలు లేకపోలేదు.
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!