ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు సత్తాచాటారు. షాహీన్ అఫ్రిది 3, హుస్సేన్ తలత్ 2 వికెట్స్ తీయడంతో లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 రన్స్ మాత్రమే చేసింది. కమిండు మెండిస్ (50; 44 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో చమిక కరుణరత్నే (17), వానిండు హసరంగా (15) రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేసింది.
Also Read: Junior OTT: సీనియర్‌కి సెమిస్టర్ పరీక్షలున్నాయి.. జూనియర్ 30న వస్తున్నాడు!
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఆరంభంలోనే లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక
(8), కుసాల్ మెండిస్ (0)లను పెవిలియన్ చేర్చాడు. కుశాల్ పెరీరా (15), చరిత్ అసలంక (20)లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. హరీస్ రవూఫ్, హుస్సేన్ తలత్ వీరిని అవుట్ చేసి పాకిస్థాన్కు బ్రేక్ ఇచ్చారు. దాసున్ షనక డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో కమిండు మెండిస్ క్రీజులో పాతుకుపోయాడు. మెండిస్ హాఫ్ సెంచరీ చేయడంతో లంక పోరాడే స్కోర్ చేసింది. హరీస్ రవూఫ్ భారీగా రన్స్ ఇచ్చినా రెండు వికెట్స్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం రెండు జట్లకు కీలకం. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. మరి స్వల్ప లక్ష్యంను పాక్ ఛేదిస్తుందో లేదో చూడాలి.