Operation Sindoor: పాకిస్తాన్ డ్రోన్ దాడి కారణంగా ఒక సైనికుడు అమరుడయ్యారు. డ్రోన్‌ని అడ్డగించిన సమయంలో దాని శకలాల్లో ఒకటి బలంగా తాకడంతో జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. శనివారం, జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలోని వైమానిక స్థావరంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డ్రోన్‌ని విజయవంతంగా అడ్డగించింది. అయితే, డ్రోన్ శిథిలాలు సురేంద్ర సింగ్ మోగ అనే సైనికుడిని బలంగా ఢీకొట్టాయి. దీంతో తీవ్రగాయాలైన అతను మరణించాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సురేంద్ర సింగ్ విధుల్లో…