Pak Drone: పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం సరిహద్దు భద్రతా దళం కూల్చివేసింది. ఏకే సిరీస్ రైఫిల్, మూడు డజన్లకు పైగా బుల్లెట్ రౌండ్‌లను ఆ డ్రోన్ మోసుకెళ్లిందని ఫోర్స్ అధికార ప్రతినిధి తెలిపారు. సరిహద్దు రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ జిల్లా మెట్ల గ్రామ సమీపంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో హెక్సాకాప్టర్ డ్రోన్‌ను భద్రతా దళ అధికారులు అడ్డుకున్నారు. దానిని వెంటనే కూల్చివేశారు.
Read Also: Police Station: పోలీస్ స్టేషన్ ఆవరణలోనే విగతజీవిగా పోలీసు అధికారి.. అసలేం జరిగింది?
నిర్దేశించిన కసరత్తుల ప్రకారం.. దళాలు కాల్పుల ద్వారా డ్రోన్‌ను అడ్డగించేందుకు ప్రయత్నించాయని, తెల్లవారుజామున ఆ మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారని, ఇందులో పోలీసులు కూడా పాల్గొన్నారని ఓ బీఎస్‌ఎఫ్ ప్రతినిధి చెప్పారు. నబీ నగర్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్‌తో పాటు ఏకే రైఫిల్, రెండు మ్యాగజైన్లు, 40 బుల్లెట్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.