అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బెహారాలోని గోరి ప్రాంతంలో ఉన్న పహల్గామ్ దాడిలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిపై భద్రతా దళాలు బాంబు దాడి చేశాయి. ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గుర్రీగా గుర్తించబడిన ఉగ్రవాది.. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన దాడిని ప్లాన్ చేయడం, అమలు చేయడంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో పాల్గొన్న మరో స్థానిక ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ట్రాల్‌లో ఉన్న ఇంటిని జమ్మూకశ్మీర్ పరిపాలన బుల్డోజర్ తో కూల్చివేసింది.
READ MORE: RCB vs RR: మా ప్రణాళిక చాలా సింపుల్.. ఆర్సీబీ విజయంపై విరాట్ కోహ్లీ!
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జమ్మూకశ్మీర్ సందర్శించడానికి వచ్చారు. ఉగ్రవాదులలో ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారు. స్థానిక ఉగ్రవాదులిద్దరినీ బిజ్‌బెహారా నివాసి ఆదిల్ హుస్సేన్ థోకర్, త్రాల్ నివాసి ఆసిఫ్ షేక్‌గా గుర్తించినట్లు వర్గాలు తెలిపాయి.
READ MORE: Vijayawada: బెజవాడలో 10 మంది ఉగ్రవాదులు?.. ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా..
సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. ఆదిల్ 2018లో అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా చట్టబద్ధంగా పాకిస్థాన్‌కు వెళ్లాడు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరంలో శిక్షణ పొందాడు. గత సంవత్సరం జమ్మూ కశ్మీర్‌కు తిరిగి వచ్చాడు. పహల్గామ్ దాడిని ప్రత్యక్షంగా చూసిన కొందరు ఉగ్రవాదులు తమలో తాము పష్టున్ భాషలో మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరూ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందినవారని వర్గాలు నొక్కిచెప్పాయి. అయితే, ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కూడా బాధ్యత వహించింది.