Hamas: పాక్‌లో హమాస్ అగ్ర నేతలు తిష్ట.. అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు!
- పాక్‌లో హమాస్ అగ్ర నేతలు తిష్ట
- పహల్గామ్‌లో అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు!
- ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ అగ్ర నేతలు పాకిస్థాన్‌లో తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. లష్కరే తోయిబాతో కలిసి హమాస్ కలిసి పని చేస్తున్నట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ధృవీకరించారు.
ఇటీవల కాలంలో హమాస్ నాయకులు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ప్రాంతాన్ని సందర్శించినట్లుగా రూవెన్ పేర్కొన్నారు. అక్కడ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశం అయినట్లుగా తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపినట్లుగానే.. పహల్గామ్‌పై కూడా అదే మాదిరిగా ఉగ్రదాడి జరిగిందని.. రెండింటికీ పెద్ద తేడా లేదని రూవెన్ అజార్ పేర్కొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారమే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినట్లుగా వెల్లడించారు. అక్టోబర్ 7, 2023న కూడా హమాస్ పౌరులనే లక్ష్యంగా చేసుకున్నారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులనే టార్గెట్ చేసుకున్నారని.. ఇదంతా హమాస్ సాహకారంతోనే పహల్గామ్ ఘటన జరిగినట్లు వివరించారు. అప్పుడు ఇజ్రాయెల్ పౌరులు సంగీత కార్యక్రమంలో ఉండగా దాడి చేశారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులు సరదాగా గడుపుతున్న సమయంలో ఎటాక్ చేశారని గుర్తుచేశారు. హమాస్-లష్కరే తోయిబా సమన్వయంతోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని స్పష్టం చేశారు.
Also Read
ఇది కూడా చదవండి: Pak-India: ఎల్‌ఓసీ వెంబడి పాక్ కాల్పులు.. తిప్పికొడుతున్న భద్రతా దళాలు
భారత్‌ను ఒక లక్ష్యంతో దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. కుట్రలో భాగంగానే ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్.. కాశ్మీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. విదేశాల్లో ఉన్న పాక్ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ కాశ్మీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. కాశ్మీర్ మన ఊపిరి, మన జీవనాడి.. దాన్ని ఎలా మరిచిపోతాం అంటూ ఉద్వేగ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం తర్వాతే ఈ పహల్గామ్ ఘటన చోటుచేసుకుంది. ఇదంతా చూస్తుంటే.. కచ్చితంగా ఒక పక్కా స్కెచ్‌తో భారత్‌పై ఉగ్రదాడి జరిగినట్లుగా అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: Indian Airlines: ‘‘పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత’’.. భారతీయ విమానాలపై అదనపు భారం..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు