పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదులను నాశనం చేసేందుకు భారత్ ఇలాగే దాడులు కొనసాగించాలని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఎక్స్ వేదిగా పోస్ట్ చేశారు.
భారత్ సైన్యం చేసిన దాడిలో 4 జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఈ హెడ్‌క్వార్టర్ ఉంది. సుమారు, 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం నుంచే 2019లో పుల్వామా దాడికి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు.
మొత్తం ఆపరేషన్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. భారత ఆర్మీకి సపోర్టుగా నిలిచారు. ఇక, ఉగ్రవాద శిబిరాలపై దాడుల వివరాలను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు తెలియజేశారు.
80 Terrorists Killed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో భారత్ తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస దాడుల్లో సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి.
గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన దాడి తర్వాత బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడి చేసింది. క్షిపణి దాడిలో కనీసం ఎనిమిది మంది మరణించారని పాకిస్తాన్ తెలిపింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిన ఫిరంగి దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారని భారత సైన్యం తెలిపింది. Also Read:Rajnath Singh: ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే భారత్ లక్ష్యం.. ఈ…
Operation Sindoor: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారతదేశం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌పై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టినట్లు ఇండియన్ సైన్యం ప్రకటించింది.
సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంట పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు మృతి చెందారు.
ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాక్ట్ అయ్యారు. తమ దేశంలోని 5 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని వెల్లడించారు.
India PakistanTensions: భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌కి బిగ్ మెసేజ్ పంపించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన విషయం తెలిసింది. మంగళవారం, సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ పరోక్షంగా పాకిస్తాన్‌ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇకపై భారతదేశ నీరు భారత్ కోసమే ప్రవహిస్తుంది. భారతదేశం కోసమే ఆగిపోతుంది, భారతదేశానికి మాత్రమే ఉపయోగిపడుతుంది’’ అని అన్నారు. ‘‘ఈరోజుల్లో మీడియాలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. గతంలో, భారతదేశ హక్కుగా…