ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈమేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ గారికి కేసీఆర్ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలు వున్నాయన్నారు. కేసీఆర్ వి అబద్ధాలేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు ఆధారాలతో సహా తేల్చారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి.. లేనిపక్షంలో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి. పంజాబ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే…
కేంద్రంలో బీజేపీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యునివర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీకి భూమి ఇచ్చినా ఇవ్వలేదన్న మెంటల్ పార్టీ బీజేపీ అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేంద్రం తీరుకు బాధతో వరి పంట వేయవద్దని చెప్పారు. కేంద్రం రా రైస్ ను కొనుడు కాదు..ఒడ్లు కొనేవరకు వదిలిపెట్టేది లేదు. గ్రామాలలో…
కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఎజెండా వారిది కాదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజల అజెండానే మా ఎజెండా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు వరి ధాన్యం సమస్య రాలేదు. ఎంతో కష్టపడి తెగుళ్ళతో పోరాడి పంట పండిస్తే వరి ధాన్యం కొనుగోలు చేయమంటే రైతులు ఏం చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆడుతున్న నాటకంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల కోసమే మేం ప్రయత్నిస్తున్నాం. నేతలు ఎక్కడికక్కడ రైతులకు భరోసా ఇస్తున్నాం. చేసే…
వ్యవసాయంలో వరి సాగు వలన లాభం లేదు. ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టం తీరడం లేదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. రొయ్యిల చెరువుల సాగుకు అవకాశం ఉంటే చెయ్యటం మంచిది. శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. గతంలో మత్స్యకారప్రాంతాలను అభివృద్ది చేయకుండా తప్పుచేసామని నేను ఒప్పుకుంటా. శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసారు. తలసరి ఆదాయం పెరగటానికి , మన తలరాత మార్చడానికి ఆక్వారంగంలోని…
తెలంగాణ కాంగ్రెస్ వినూత్నంగా నిరసన తెలిపింది. వరి ధాన్యం విషయంలో ఢిల్లీతో తేల్చుకునే వస్తాం అని చెప్పిన మంత్రులు ఖాళీ చేతులతో రావడంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీకి వెళ్ళిన మంత్రులు రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసింది.ఢిల్లీ వెళ్ళి వచ్చిన మంత్రులకు చీరె, సారె పంపారు కాంగ్రెస్ మహిళా నేతలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాక్షస క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి. పార్లమెంట్ సమావేశాల్లో పోరాడలేక టీ.ఆర్.ఎస్ ఎంపీలు చేతులెత్తేశారని,…
తెలంగాణలో రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం నాటకలాడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ అనుబంధ సంఘాలన్నిటితో సమావేశం జరిగిందని, ఈ రోజు డిజిటల్ మెంబర్షిప్ తో పాటు భూ వివాదాలపై పాదయాత్ర పై చర్చించాం అన్నారు మహేష్ కుమార్ గౌడ్. భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర లోని సేవాగ్రాం వరకు పాదయాత్ర జరగనుంది. జనవరి 30 నుంచి పాదయాత్ర ను మీనాక్షి నటరాజన్ చేయనున్నారు. ఈ పాదయాత్ర లో ఒక్క రోజు…
ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తున్నది.ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించాం. అదనంగా తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ 5 రెట్లు పెంచాం అన్నారు మంత్రి పీయూష్ గోయల్. 20 లక్షల…
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. రేపు చావుడప్పుల పేరిట బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడం లాంటిదన్నారు. పరిపాలన చేతనవుతాలేదని ఒప్పుకొని అస్త్రసన్యాసం చేసి ముగ్గురం ఉన్నాం మాకు ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో రెండు సంవత్సరాలు నీ కంటే గొప్పగా పాలిస్తామన్నారు. ఇప్పటికైతే చేతనైతే…
తెలంగాణలో వరి పంట కొనుగోలుపై మాటల యుద్ధం సాగుతోంది. విపక్షాలు అధికార టీఆర్‌ఎస్ పార్టీని తూర్పారబెడుతున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన రీతిలో సీఎం కేసీఆర్‌పై ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తన మెడ మీద కేంద్రం కత్తి పెడితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసిచ్చానని చెప్పిన అసమర్ధ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు మెడ మీద రైతుబంధు కత్తి పెట్టి వరి వేయవద్దంటున్నాడు. రైతుబంధు ఎత్తేసే కుట్రకు ఇది తొలి అడుగు. పారా హుషార్…
బీజేపీ నేత వివేక్ వెంకట్ స్వామి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహబూబాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీ వివేక్ బీజేపీ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్ల చేయాలన్నారు. తమను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రధాని ముందు చూపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందన్నారు. థర్డ్ ఫ్రంట్ విషయం…