తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఇది విజయవంతం అయిందని ప్రకటించింది. ‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో అక్కడి తెలంగాణ భవన్‌లో చేపట్టిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ భారీ నిరసన దీక్షలో పాల్పంచుకున్నారు. ‘ఒకే…
ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పది ప్రశ్నలు సంధించారు. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 అక్టోబర్ 4న మీరు కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆ లేఖను అడ్డు పెట్టుకునే ధాన్యం సేకరణ పై మెలిక పెడుతున్న విషయం నిజం కాదా? తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం మీకు ఎవరిచ్చారు.మీరే లేఖ…
ఢిల్లీలో టీఆర్ ఎస్ దీక్షపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. పారా బాయిల్డ్ రైస్ ను కొనలేమని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. 2021-22 రబీ సీజన్ కు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం సేకరణ ప్రతిపాదనలు పంపలేదు. ప్రతిపాదనలు పంపాలని కేంద్రం అనేకసార్లు తెలంగాణను కోరింది. రబీ నుంచి ముడి బియ్యం సేకరణపై ప్రతిపాదనల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాం అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.…
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కేంద్రం నడుస్తోంది. తాజాగా ఢిల్లీలో రైతులకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంటే.. హైదరాబాద్ ఇందిరాపార్క్ లో బీజేపీ నేతలు కూడా దీక్షకు దిగారు. దీంతో మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. బీజేపీ మోడీ సర్కారు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు కేంద్రమంత్రి మురళీధరన్. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కనీస మద్దతు ధరలు పెంచింది. తెలంగాణ రైతులకు కేంద్రం ఏమీ చేయడం లేదని కేసీఆర్ అంటున్నారు. పీయూష్ గోయల్ ధాన్యం…
తెలంగాణలో ఒక్క జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు ఎక్కువగా వుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు తార స్థాయికి చేరింది. ఏకంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై దాడికి స్వపక్షీయులే దాడి చేయడానికి ప్రయత్నించారు. మోటార్ బైక్ ను డీ కొట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే సమస్యను పరిష్కరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి కోసం ఎదురు చూసిన…
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పెన్షన్ల పేరుతో వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని అధికారం లోకి వచ్చిన తరువాత మహిళలను మోసం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి. దేశంలో ఏ రాష్ట్రంలో వడ్ల సమస్య లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉందన్నారు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని, రైతులను మోసం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన…
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కేంద్ర వైఖరిని టీఆర్‌ఎస్ తప్పుబడుతోంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్‌ఎస్. గురువారం రాష్ట్రంలో జాతీయ రహదారులను దిగ్భందించింది. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. వడ్ల కొనుగోలు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మంత్రి హరీష్ రావు…
రాహుల్ తో భేటీ కోసం ఢిల్లీ వెళ్ళిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణా లో రైతులు, ఆందోళనలో ఉన్నారు.ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది పోయి..బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సప్లై చెయ్యమని ముఖ్యమంత్రి చేసిన సంతకం రైతులపట్ల మరణశాసనం లా మారింది.కేసీఆర్ సంతకం మరణశాసనం లా…
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, అయినా సీఎం కేసీఆర్ దాని గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన అంతానికి… ఇదే ఆఖరి పోరాటం. ప్రజలంతా బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు బండి సంజయ్. ఢిల్లీలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు…