తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కేంద్రం నడుస్తోంది. తాజాగా ఢిల్లీలో రైతులకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంటే.. హైదరాబాద్ ఇందిరాపార్క్ లో బీజేపీ నేతలు కూడా దీక్షకు దిగారు. దీంతో మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. బీజేపీ మోడీ సర్కారు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు కేంద్రమంత్రి మురళీధరన్. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
కనీస మద్దతు ధరలు పెంచింది. తెలంగాణ రైతులకు కేంద్రం ఏమీ చేయడం లేదని కేసీఆర్ అంటున్నారు. పీయూష్ గోయల్ ధాన్యం కొంటామని చెప్పారు. రైతుల పంట కొనడానికి కేంద్రం డబ్బులు ఇస్తుంది. తెలంగాణ రైతులకు ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం లక్ష కోట్లు ఇచ్చింది. మద్దతు ధర కన్నా తక్కువకు రైస్ మిల్లర్లు కొంటున్నారు. మిల్లర్లు, టీఆర్ఎస్ నేతలు కుమ్మక్కయ్యారు.
కేసీఆర్ అంటే కల్వకుంట్ల కరప్షన్ రావు…కమీషన్ రావు. హుజురాబాద్ లో కమిషన్ రావు వందల కోట్లు ఖర్చు చేసిన ఈటల రాజేందర్ ని ,బీజేపీ ని ప్రజలు గెలిపించారు. కేసీఆర్ రాజకీయాలు ప్రజలకు తెలుసు. కేసీఆర్ మోడీ కి వ్యతిరేకంగా దేశమంతా తిరిగాడు… ఏమైంది.? సర్జికల్ స్ట్రైక్ మీద ఆధారాలు కావాలని కమిషన్ రావు అడుగుతున్నాడు… పాకిస్థాన్ వాళ్ళ పై ఎక్కువ నమ్మకం వుందన్నారు మురళీధరన్.