తెలుగు సినిమా ఇప్పుడు తన ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అనే స్థాయిని దక్షిణాది సినిమా పూర్తిగా ఆక్రమించేసింది. దానికి అనుగుణంగా దక్షిణాది సినిమాలకు, తారలకు, దర్శకులకు క్రేజ్ పెరిగింది. అయితే ఈ పెరుగుడు అసలు నిర్మాత మనుగడకే ప్రమాదం తీసుకురానుందా!? అంటే యస్ అనే వినిపిస్తుంది. సినిమాకు సంబంధించి రాబడి అంటే ఒకప్పుడు కేవలం థియేట్రికల్ కలెక్షనే. రాను రాను ఆదాయ మార్గాలు పెరిగాయి. ఆడియో, వీడియో, డబ్బింగ్, డిజిటల్,…