జూబ్లీహిల్స్‌లో కమలం ఎందుకు వాడిపోయింది? కనీసం డిపాజిట్ కూడా దక్కక పోవడానికి కారణాలేంటి? లోపం ఎక్కడ జరిగింది? కార్యకర్తల కష్టానికి కనీస విలువ కూడా లేకుండా చేసింది ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలుగంటున్న పార్టీ ఈ ఫలితాన్ని ఎలా చూస్తోంది? జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీకి భారీ ఝలక్ తగిలింది. కనీసం డిపాజిట్ దక్కకుండా పోయింది. అంతెందుకు… 2023లో వచ్చిన ఓటు శాతాన్ని కూడా తిరిగి సాధించుకోలేకపోయింది కాషాయ దళం. దీంతో… అసలు మనం ఎక్కడున్నాం….…
ఆ నియోజకవర్గంలో…కూటమి, వైసీపీ నేతలు కలగలిసి యుగళ గీతం పాడుతున్నారా? ప్రజలంతా ఒకవైపు, అన్ని పార్టీల నాయకులు మాత్రం మరో వైపు అన్నట్టుగా ఉందా? ఏ విషయంలో జనాన్ని కాదని పార్టీలకు అతీతంగా నాయకులు పిల్లి మొగ్గలేస్తున్నారు? ఎక్కడ ఉందా పరిస్థితి? కర్రుగాల్చి వాత పెట్టడానికి అక్కడి జనం కూడా ఎదురు చూస్తున్నారన్నది నిజమేనా? జిల్లాల పునర్విభజనలో భాగంగా… ఉమ్మడి తూర్పు గోదావరిని మూడుగా విభజించింది గత వైసీపీ ప్రభుత్వం. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరిగిన ఆ…
ఒక్క ఫలితం… వంద సంకేతాలు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ విషయంలో జరుగుతున్న చర్చ ఇది. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు వ్యక్తిగతంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఇది నిజంగా బూస్ట్ అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏయే కోణాల్లో ఈ ఫలితం ప్లస్ అవుతోంది? పార్టీ మీద, ప్రభుత్వంలో పట్టు బిగించేందుకు సీఎం చేతిలో ఎలాంటి అస్త్రం అవబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీ పరపతికి, ప్రత్యేకించి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వ పటిమకు నిదర్శనమన్న అభిప్రాయం బలంగా ఉంది.…
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే…. ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి? ఒకవేళ తేడా పడితే బద్నాం అయ్యేది ఎవరు? చివర్లో డైరెక్ట్‌గా రంగంలోకి దిగిపోయి అంతా తానై నడిపిన సీఎం రేవంత్‌రెడ్డి గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయన ఎక్కడ దొరుకుతాడా అని కాచుక్కూర్చున్న పార్టీలోని ఓ వర్గం ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీనియర్స్ సహా… నాయకులు అందర్నీ గల్లీ గల్లీ తిప్పింది.…
డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ళు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాయా? పాత, కొత్త పోరాటం మళ్ళీ మొదలైందా? ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేస్తూ…. పాత కాంగ్రెస్ నాయకులు ఫీలైపోతున్నారా? ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేకి ఇవేం పట్టడం లేదా? ఎక్కడ జరుగుతోందా వర్గపోరు? దాని మూలాలు ఎక్కడున్నాయి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇళ్ళ పంచాయితీ తీవ్రమవుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యనే……
జూబ్లీహిల్స్ నియోజకవర్గ బస్తీల్లో వీధులన్నీ ఘుమఘుమలాడిపోతున్నాయ్. అంతా చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై మాటలే వినిపిస్తున్నాయ్. ఇక మందు పార్టీల సంగతైతే సరేసరి.
అక్కడ ముందు రోజు కనిపించిన కొండ మరుసటి రోజుకు షేప్ మారిపోతోందట. రాత్రికి రాత్రే విచ్చలవిడిగా జరుపుతున్న అక్రమ తవ్వకాలతో కొన్ని కొండలకు బోడి గుండ్లు అవుతుంటే… మరికొన్ని అసలు మాయమైపోతున్నాయి. ఎవరు అలా చేస్తున్నారంటే… అన్ని వేళ్ళు కూటమి ఎమ్మెల్యేల వైపే చూపిస్తున్నాయి. ఏ జిల్లాలో జరుగుతోందా తంతు? ఏ స్థాయిలో ప్రకృతి సంపద లూటీ అవుతోంది? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొండలకు బోడిగుండ్లు అవుతున్నాయి. ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌గా ఉండే ఎర్రమట్టి కొండల్ని గ్రావెల్…
ఆ మాజీ మంత్రి సోదరుడికి పసుపు వాసన పడలేదా? అందుకే కాషాయం కప్పుకుని మురిసిపోతున్నారా? టీడీపీ ఎమ్మెల్యే బ్రదర్ మిత్రపక్షం బీజేపీలో చేరడాన్ని ఎలా చూడాలి? పాత నియోజకవర్గంలో పట్టు పోతోందని ఆ టీడీపీ ఎమ్మెల్యేనే బ్రదర్‌ని పంపారా? లేక అక్కడున్న పొలిటికల్ వ్యాక్యూమ్‌తో అలా అయిపోయిందా? ఎక్కడ జరిగిందా వ్యవహారం? ఎవరా బ్రదర్స్? మాజీ మంత్రి, గుంతకల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వరుసకు సోదరుడు నారాయణ టీడీపీ కండువా తీసేసి కాషాయమ కప్పుకున్నారు. బీజేపీ…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహాలు రొటీన్‌కు భిన్నంగా ఉన్నాయా? పోల్ మేనేజ్మెంట్లో ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయా? గతంలో చూడని, వినని కొన్నిటిని చూడబోతున్నామా? అత్యంత కీలకమైన రాబోయే మూడు రోజుల్లోనే పొలిటికల్ స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కనిపిస్తాయా? ఎలా ఉండబోతున్నాయి ప్రధాన పార్టీల పోల్ ఎత్తుగడలు? ఏంటా సంగతులు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచార ముగింపు గడువు దగ్గర పడుతోంది. దాంతో…ప్రధానరాజకీయ పార్టీలన్నీ తదుపరి అంశం మీద దృష్టి పెడుతున్నాయి. నేతలు…
జూబ్లీహిల్స్‌లో బీజేపీ సింగిల్ పాయింట్ అజెండాతో ముందుకు వెళ్తోందా? అదే అంశం మీద ఓట్లు కొల్లగొట్టాలనుకుంటోందా? దాని గురించే గట్టిగా చెప్పగలిగితే… ఓ వర్గం ఓట్లు సాలిడ్ అవుతాయని కాషాయ దళం లెక్కలేస్తోందా? ఇంతకీ ఉప ఎన్నిక బరిలో కమలం పార్టీ ప్లాన్ ఏంటి? ఓట్ల వేటలో పార్టీ ప్రయోగిస్తున్న ప్రధాన అస్త్రం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్‌కు చేరింది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం పొగలు సెగలు పుట్టిస్తోంది. కలిసి వచ్చే ఏ…