భారతీయ చలనచిత్ర సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి.. త్వరలో ఒక అపురూపమైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. అదెంటీ అంటే దేశభక్తికి నిలువుటద్దంలా నిలిచే ‘వందేమాతరం’ గేయానికి ఆయన తనదైన శైలిలో సరికొత్తగా స్వరకల్పన చేశారు. ఈ అద్భుతమైన గీతాన్ని ఈ ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రదర్శించనున్నారు. విశేషమేమిటంటే, దేశం నలుమూలల నుండి విచ్చేసిన…