కన్నడ అనుకూల సంస్థలు సైన్‌బోర్డ్‌లు, నేమ్‌ప్లేట్లు, ప్రకటనలపై కన్నడ భాషను ప్రదర్శించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకస్మికంగా సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. సైన్‌బోర్డ్‌లో 60 శాతం కన్నడలో ఉండాలని ఆయన తెలిపారు.
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం సీపీఐ జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పోరాటానికి మద్దతుగా ఉంటామని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను మద్దతు కోరుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసిన ఆయన నేడు ఎస్పీ అధినేత అఖిలేశ్‌తో సమావేశం కానున్నారు.
క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడం, ఆయనపై వెంటనే అనర్హత వేటు పడడం.. 2013లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తోంది. 2013లో సెప్టెంబర్‌లో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఓ ఆర్డినెన్స్ కాపీని చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద మతమార్పిడి నిరోధక బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. మత మార్పిడి నిరోధక బిల్లుపై ఈ రోజు సీఎం బస్వరాజ్ బొమ్మై కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ బిల్లుపై ఆర్డినెన్స్ తెస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, మండలి ప్రొరోగ్ కావడంతో బొమ్మై సర్కార్ ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లును 2021 డిసెంబర్ లో కర్ణాటక శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వంలో బీజేపీ ఉండటంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటంతో…