మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి.. చెత్త తొలగించని కారణంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మిగిలిందని.. దీన్ని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలని సీఎం సూచించారు.
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలోని 52 గ్రామ పంచాయతీలలో పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ కేడర్ కావాలని విజ్ఞప్తి చేసిన 11మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు కేంద్రం నో చెప్పింది. ఈ 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలోనే రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డీఓపీటీ (DOPT) ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి.. తనకు తెలంగాణ కేడర్ కావాలని కోరింది. దీనిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్ ను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు…
ఈరోజు మధ్యాహ్నం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం భారీ ఎత్తున కురుస్తుండతో ఆందోళన మొదలైంది. ఎగువన కూడా బయ్యారం, గార్ల, మహబూబాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మున్నేరుకి వరద వస్తుంది. దీంతో.. మున్నేరు ముంపు బాధితులను మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
రెస్టారెంట్‌లో కడుపారా తిని ఆస్వాదిద్దామనుకుని వెళ్తే ఏకంగా ప్రాణాలే పోయాయి. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సూచనతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మె విరమించారు. కాగా.. వారు 11 రోజులుగా ఆందోళన చేపట్టారు. కోల్‌కతా రేప్ కేసును పరిగణనలోకి తీసుకున్నందుకు, దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల భద్రత.. భద్రత సమస్యను పరిష్కరించినందుకు రెసిడెంట్ వైద్యులు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 30 వైడ్ బాడీ A350-900 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఎయిర్‌లైన్స్ గురువారం ఈ ప్రకటన చేసింది. కంపెనీ ప్రస్తుతం నారో బాడీ ఎయిర్‌బస్ విమానాలను మాత్రమే నడుపుతోంది. అయితే.. ఇస్తాంబుల్ మార్గంలో కార్యకలాపాల కోసం టర్కిష్ ఎయిర్‌లైన్స్ నుండి రెండు బోయింగ్ 777 విమానాలను కంపెనీ లీజుకు తీసుకుంది.
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల…
FlipKart: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ ప్రపంచం అయిపోయింది. వర్క్ లో ఒత్తిడి పెరిగి టైమ్ లేకపోవడంతో అందరూ ఆన్ లైన్ షాపింగ్ ల పైనే ఆసక్తి చూపుతున్నారు. రకరకాల ఈ కామర్స్ సైట్ లు అందుబాటులోకి రావడం కూడా ఆన్ లైన్ షాపింగ్ వినియోగం పెరగడానికి కారణమవుతుంది. బయట షాపుల్లో దొరకని చాలా వస్తువులు కూడా ఆన్ లైన్ లో తక్కువ రేట్లకు దొరుకుతున్నాయి. అంతేకాకుండా వాటిని ఇంటి వద్దకే డెలివరీ చేస్తుండటంతో చాలా మంది…