FlipKart: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ ప్రపంచం అయిపోయింది. వర్క్ లో ఒత్తిడి పెరిగి టైమ్ లేకపోవడంతో అందరూ ఆన్ లైన్ షాపింగ్ ల పైనే ఆసక్తి చూపుతున్నారు. రకరకాల ఈ కామర్స్ సైట్ లు అందుబాటులోకి రావడం కూడా ఆన్ లైన్ షాపింగ్ వినియోగం పెరగడానికి కారణమవుతుంది. బయట షాపుల్లో దొరకని చాలా వస్తువులు కూడా ఆన్ లైన్ లో తక్కువ రేట్లకు దొరుకుతున్నాయి. అంతేకాకుండా వాటిని ఇంటి వద్దకే డెలివరీ చేస్తుండటంతో చాలా మంది వాటి ద్వారానే ఆర్డర్ చేసుకుంటున్నారు. బట్టలు, మేకప్ ఐటమ్స్, పూజసామాన్ల నుంచి హోమ్ అప్లియన్సెస్ వంటి వస్తువులను కూడా ఆన్ లైన్ ద్వారానే తెప్పించుకుంటున్నారు. ఇక ల్యాప్ ట్యాప్ లు, టీవీలు, ఫోన్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ లు లాంటివైతే బయట షాపుల్లో కంటే ఈ కామర్స్ సైట్లలోనే తక్కువకి, ఎక్కువ నాణ్యతతో లభిస్తాయి. అందుకే ఎక్కువ మంది వాటి ద్వారా ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ లను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా సందర్భాల్లో మనం ఆర్డర్ పెట్టిన వస్తువులు మనకు సక్రమంగా వస్తాయి. అప్పుడప్పుడు మాత్రం మనం ఆర్డర్ పెట్టినవి కాకుండా వేరేవి వస్తూ ఉంటాయి. ప్రస్తుతం అలాగే ఓ వ్యక్తి కి జరిగింది.
Also Read: Divorce: వేరు కాపురం అంటున్న భార్యలకు షాక్.. అలాంటి వారికి ఇక విడాకులే అన్న కోర్ట్
అథర్వ ఖండేల్వాల్ అనే ఒక వ్యక్తి ఆన్ లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్టులో యాపిల్ మ్యాక్ బుక్ కోసం ఆర్డర్ పెట్టాడు. దాని కోసం రూ.76,000 కూడా చెల్లించాడు. అయితే దాని డెలివరీ అనుకున్న సమయానికి రాకుండా ఆలస్యం అయ్యింది. దీంతో ఆ వ్యక్తే ఫ్లిప్‌కార్ట్ హబ్ కి వెళ్లి తన ఆర్డర్ ని తీసుకున్నాడు. ఆర్డర్ డిటైల్స్ తో పాటు ఓటీపీ చెప్పగా డెలివరీ ఏజెంట్ వచ్చి అథర్వ పేరు మీద వచ్చిన ప్యాకేజీని అతనికి ఇచ్చాడు. ఎంతో ఆశగా దానిని తెరచి చూసిన ఆథర్వకు నిరాశ ఎదురయ్యింది. అందులో మ్యాక్ బుక్ కు బదులు బోట్ స్పీకర్స్ వచ్చాయి. అతను ఈ మొత్తాన్ని వీడియో కూడా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఫ్లిప్ కార్ట్ కస్టర్ మర్ కేర్ ను సంప్రదించి తన డబ్బులు రిఫండ్ చేయాలని కోరాడు. అయితే అతనికి ఫ్లిప్ కార్ట్ షాకిచ్చింది. ఓపెన్ బాక్స్ కు వర్తించే ‘ నో రిఫండ్ పాలసీ ప్రకారం రిఫండ్ ఇవ్వడం కుదరదని తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియని అథర్వ ట్విటర్ ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపాడు.