Nadendla Manohar: దేశ రాజకీయాలలో మార్పు తీసుకురావాలనేది జనసేన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దని.. జనసేన కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోయారని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ…
ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులకు తాళలేక 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.
బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పార్లమెంట్‌లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో పార్లమెంటు లోపలా, వెలుపలా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు.
విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్, బీజేపీలు వాయిదా తీర్మానాల కోసం డిమాండ్ చేశాయి. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ శాసనసభ్యుల నిరసన మధ్య మూడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
One Nation One Election Bill: జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్‌సభ ముందుకు వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ” వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ” పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రమంత్రి సభకు పరిచయం చేశారు. అయితే, జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్…
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ముందు వేటుకు గురైన భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను రాజ్యసభకు పంపాలని డిమాండ్ పెరిగింది. ఆమె వేటుకు గురైనప్పుడు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది.
ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు చేసిన నినాదాలు, గందరగోళం మధ్య ఉభయసభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. తక్షణమే చర్చకు ప్రతిపక్షాలు లేవనెత్తడంతో ఎగువ సభ ఎలాంటి కార్యకలాపాలు లేకుండా వాయిదా పడింది.