తమ పార్టీ నుంచి వాళ్ల పార్టీకి బాలినేని అలిగి వెళ్ళారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “నా ఆస్తులు నాశనం చేసుకున్నాను అంటారు.. జగన్ నా దోపిడీ చేసారు అని చెప్పటానికి సిగ్గులేదా.. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలు చెబుతున్నా అని మాట్లాడారు.. బాలినేని, సాయిరెడ్డి ఇద్దరు జగన్ పక్కన ఉండి రాజకీయాలు చేయలేదా.. ఇలాంటి వాళ్ళను నమ్మి పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే ఇంక అంతే…
పిఠాపురం జనసేనకు పుష్కర కాలం తర్వాత ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారని.. పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభకు గెలిచిన తర్వాత తొలిసభ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభ కోసం ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారన్నారు.. పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని..