Pakistan: భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని పాకిస్తాన్ వెన్నులో వణుకుపుడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్‌లోని 15 నగరాలపై దాడి చేసేందుకు యత్నించింది.
జైపుర్‌లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్‌కు ఓ మెయిల్ వచ్చింది. స్టేడియం అధికారులు వెంటనే జైపుర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం జైపుర్ స్టేడియంలో బాంబు పేలుడు నిర్వహిస్తాం. మీకు వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ మెయిల్ వచ్చిందని తెలిపారు. దీంతో భద్రతా దళాలు స్టేడియం చుట్టుపక్కల సెక్యూరిటీని కట్టుదిట్టం…
S-400 Sudarshan Chakra: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ నాశనం చేసింది. దీంతో రగిలిపోతున్న దాయాది భారతదేశంలోని 15 నగరాలపై డ్రోన్, క్షిపణి దాడులకు ప్రయత్నించి భంగపడింది. ముఖ్యంగా, సరిహద్దుల్లో ఉన్న అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తల, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరాలాయ్, భుజ్లతో సహా అనేక సైనిక లక్ష్యాలపై దాడులకు యత్నించింది. ఈ దాడుల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ముఖ్యంగా, రష్యా…
‘ఆపరేషన్ సిందూర్’ లో భాగంగా భారత్ చేపట్టిన వైమానిక దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే.. ఈ దాడిలో జైషేను స్థాపించిన మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమైన విషయం తెలిసిందే. మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఈ దాడిలో ప్రాణాలు కొల్పోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.…
India Pakistan War: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన కొద్దిసేపటికే, భారత్ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌కి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత్‌పై భారీ దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సాయుధ దళాలు పాకిస్తాన్ ‘‘గగనతల రక్షణ వ్యవస్థ’’ని నాశనం చేసినట్లు ప్రకటించాయి. పాక్ భారత్‌లోని 15 నగరాలపై డ్రోన్-మిస్సైల్ దాడులు చేసేందుకు ప్రయత్నించిందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. Read Also: India Pakistan Tension:…
India Pakistan Tension: ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల తర్వాత భారత్ మరోసారి పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం కరాచీ, లాహోర్, సియాల్కోట్, రావల్పిండి సహా 10 నగరాలపై డ్రోన్ అటాక్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పాకిస్తాన్ ‘‘గగనతల రక్షణ వ్యవస్థ’’ టార్గెట్ చేసినట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది. పాకిస్తాన్ దాడులు చేస్తుందనే అనుమానం నేపథ్యంలో భారత్ ఈ రక్షణ వ్యవస్థల్ని నాశనం చేసినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2025లో భాగంగా మే 11న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వేదిక మారింది. ధర్మశాలకు బదులు అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ధృవీకరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ఉత్తర భారతదేశంలోని చాలా విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేయబడ్డాయి. పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ రోడ్డు మార్గంలో ఢిల్లీకి చేరుకుని, ఢిల్లీ…
Pakistan: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్, భారత్‌తో వాణిజ్యం రద్దు మొత్తంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌ని కుదేలు చేస్తున్నాయి. పాక్ వ్యాప్తంగా ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడుల తర్వాత కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ కుప్పకూలింది. పాకిస్తాన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ KSE-30 ఏకంగా 7200 పాయింట్లు పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్‌ని నిలిపేసింది. వరసగా రెండవ సెషన్లో భారీ నష్టాలను చవిచూసింది. గురువారం ఉదయం కరాచీ, లాహోర్‌తో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్ల…
Indo-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్ అటాక్ నిర్వహించింది. ఈ దాడిలో 100 మందికి పైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాడులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
India-Pakistan Conflict: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ రోజు ఉదయం పాకిస్తాన్ లాహోర్‌తో పాటు ఇతర నగరాల్లో పేలుడు శబ్ధాలు వినిపించడంతో ఒక్కసారికి పాక్ ప్రజల్లో వణుకు పట్టింది. భారత్ మళ్లీ దాడి చేస్తుందా..? అనే అనుమానాలు పాక్ ప్రజలు వ్యక్తపరిచారు. అయితే, తాజాగా పాక్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్పీఆర్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ పేలుళ్లకు భారత్ కారణమని ఆరోపించింది. తాము ఇండియాకు చెందిన 12…