భారత్ నిజంగా యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రధాని మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదని, దేశం ఎంతో సంయమనం పాటించిందన్నారు. ఆడ బిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే.. ఇద్దరు ఆడబిడ్డలు ధర్మయుద్దానికి నాయకత్వం వహించారన్నారు. ఏ ఒక్క పాకిస్తానీ సామాన్యుని ముట్టుకోలేదని, కేవలం ముష్కరుల స్థావరాలపైనే దాడి జరిగిందన్నారు. దేశ సహనాన్ని చేతకాని తనం అనుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అవగాహన సదస్సులో రఘునందన్ రావు పాల్గొన్నారు.
‘గత మూడు రోజులుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ధర్మ యుధం చేస్తుంటే.. ఈ దేశ తిండి తింటూ కొందరు విమర్శిస్తున్నారు. అందులో కమ్యూనిస్టులు, పలు రంగుల జెండాల లీడర్లు, జర్నలిస్టు ముసుగులో అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఉగ్రవాదులను చంపితే వీళ్లకేంటి నొప్పి. బట్టలిప్పి మతం తెలుసుకొని మరీ చంపుతుంటే ఎటుపోయారు ఈ సోకాల్డ్ లీడర్లు. చంపుతూ పోతుంటే.. చూసుకుంటూ పోవాలా?. కాళ్లకు పారాణి అరక ముందే సింధూరం కోల్పోయారు. భారత్ నిజంగా యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు. ప్రధాని మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదు. దేశం ఎంతో సంయమనం పాటించింది. ఆడ బిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే ఇద్దరు ఆడ బిడ్డలు ధర్మయుద్దానికి నాయకత్వం వహించారు’ అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
Also Read: Murali Naik: మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: ఏపీ సీఎం
‘ఏ ఒక్క పాకిస్తానీ సామాన్యుని ముట్టుకోలేదు. కేవలం ముష్కరుల స్థావరాలపైనే దాడి జరిగింది. దేశ సహనాన్ని చేతకాని తనం అనుకుంటే తగిన బుద్ధి చెప్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను, పాకిస్తానీలను ఎపుడు ఏరివేస్తావని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ర్యాలీలతో మద్దతు రాదు. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా మాట్లాడే ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొందరు ప్రొఫెసర్లు దేశ సంపదలో జీతం తీసుకుంటూ ఉగ్రవాదులపై ప్రేమ కురిపిస్తున్నారు. ఉగ్రవాదులను మద్దతు పలికితే దేశద్రోహులే. కన్న తల్లికి అన్నం పెట్టని వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతారు’ అని ఎంపీ రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.