Mohan Bhagwat : ఆపరేషన్ సిందూర్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సిందూర్ దేశ గౌరవాన్ని, ధైర్యాన్ని పెంచిందంటూ ప్రకటించారు. కర్ణాటకలోని బెలగావిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ పహల్గాం బాధితులకు అసలైన నివాళి అంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశ త్రివిధ దళాలను ఆయన ప్రశంసించారు.
Read Also : India-Pak War : జమ్మూలో పేలుళ్లు.. సైరన్ లు వినిపిస్తున్నాయి : సీఎం ఒమర్ అబ్దుల్లా
ఇండియా శాంతి కోరుకునే దేశమే అయినా.. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఇలాంటి దాడులు జరగాల్సిందేనని చెప్పారు. శాంతి అంటే హింసను అంగీకరించడం కాదని.. అవసరం అయితే ఎంత వరకు వెళ్లడానికైనా ఆర్మీ సిద్ధంగానే ఉంటుందని చెప్పారు. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వానికి, ఇండియన్ ఆర్మీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశ పౌరులు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, ఆదేశాలను కచ్చితంగా పాటించాలని.. ఎలాంటి ఫేక్ ప్రచారాలను చేయొద్దని కోరారు. దేశ వ్యతిరేక చర్యలను అస్సలు ప్రోత్సహించవద్దని.. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలంటూ తెలిపారు.
Read Also : Pawan Kalyan: పదవి ఉన్నంతకాలం.. నా జీతం మొత్తం మీకోసమే!