Maoist Party Telangana: ఇటీవల మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ విడుదల విడుదల చేసింది. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు శిక్ష తప్పదంటూ హెచ్చరించింది. రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. “విప్లవోద్యమానికి ద్రోహం చేసిన మల్లోజుల, ఆశన్నలకు అమరుల సాక్షిగా శిక్ష తప్పదని శపథం చేస్తున్నాం. పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగని తీవ్రమైన నమ్మక ద్రోహం మల్లోజుల, ఆశన్న చేశారు.. కుట్రదారులు కార్యాచరణ ఆపరేషన్ కగార్ తో మొదలైంది. మల్లోజుల ఆశన్న నమ్మక ద్రోహాన్ని పార్టీ తీవ్రంగా భావిస్తుంది.” అని లేఖలో పేర్కొన్నారు.
READ MORE: SSMB29 : మహేశ్ బాబు – రాజమౌళి.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌కు డేట్ ఫిక్స్
మరోవైపు.. అభయ్ పేరుతో కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. ఈనెల 24 న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని సాగిస్తూ, మావోయిస్టులను హత్య చేయడానికి నిరసనగా ఈ నెల 23 వరకు నిరసన వ్యక్తం చేయాలని, 24 న దేశావ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
READ MORE: Karoline Leavitt: ట్రంప్-పుతిన్ భేటీపై ప్రశ్న.. పరుష పదం ఉపయోగించిన కరోలిన్ లీవిట్