KA Paul : బెట్టింగ్ యాప్స్ యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లే, ఆన్‌లైన్ బెట్టింగ్ కూడా తీవ్రమైన వ్యసనంగా మారుతోంది. ఫలితంగా ఆర్థిక నష్టం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ వ్యవహారం సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. మనీ గేమింగ్ – బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు కేఏ పాల్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవని.. ఈ విషయంపై గతంలోనే నేను ఎన్నోసార్లు చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.
Hyderabad: దారుణం.. కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేసిన బైక్ రేసర్..
ప్రతి ఇంట్లో అరచేతిలో ఉండే ఫోన్లోనే లభిస్తాయని, తెలంగాణలో యాప్స్ పై బ్యాన్ ఉన్నప్పటికీ 978 మంది చనిపోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు, సినీ నటులను యువత రోల్ మోడల్ గా తీసుకుంటారు. కానీ వారంతా సైతాన్లుగా మారారని, పరోక్షంగా ఇంత మంది చావులకు కారణమయ్యారన్నారు కేఏ పాల్. వీటి ద్వారా రూ. 7 – 14వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వాలు మిన్నకున్నాయని, అంతకంటే ఎక్కువ నిధులు నేను తెచ్చి పెడతానన్నారు కేఏపాల్. అన్ని మనీ గేమింగ్ యాప్స్‌ను తక్షణమే బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 72 గంటల్లోగా సెలబ్రిటీలు ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలి. నష్టపోయినవారికి పరిహారం ఇప్పించాలని ఆయన కోరారు. సెలబ్రిటీలు ఎవరినీ వదిలిపెట్టనని, ఇది బెదిరింపు కాదు, ఈడ్చుకెళ్తాను అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు.
Feet Healthcare : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త !