ICC: ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. దీంతో అందరూ ఆన్‌లైన్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. అయితే ఇదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి. చాలా మంది సామాన్యులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. విచిత్రం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను నడిపించే ఐసీసీ కూడా సైబర్ నేరగాడి వలలో పడింది. 2.5 మిలియన్ డాలర్లకు పైగా ఐసీసీ మోసపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ కరెన్సీలో 2.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20 కోట్లు. దుబాయ్‌లోని…
ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి..! ధరలు మరీ ఆకాశాన్నంటే స్థాయిలో ఉండటంతో.. మధ్యతరగతి వారు దాన్ని కొనుగోలు చేసేందుకు సాహసించరు. అదే.. కొన్నాళ్లకు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తే మాత్రం, కొనేందుకు ఎగబడుతుంటారు. అప్పుడప్పుడు పాత మోడళ్లను ఆఫర్ల పేరుతో తక్కువ ధరకే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడితే.. విక్రయాలు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందేగా! క్షణాల్లోనే అమ్ముడుపోతాయి. ఇలా జనాల్లో ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ చూసే.. ఓ ముఠా ఆన్‌లైన్ మోసానికి పాల్పడింది. ఒక ఐఫోన్…
ఇంట్లోనే కూర్చొని లక్షలు సంపాదించే ఆఫర్ వస్తే.. ఎవరు వదులుకుంటారు చెప్పండి? దీనికితోడు నిరుద్యోగ సమస్య ఒకటి. ఈ రెండింటిని (ఆశ, నిరుద్యోగం) ఆసరాగా తీసుకొని, ఓ ప్రైవేట్ కంపెనీ వందల మందికి కుచ్చటోపీ పెట్టింది. వారి వద్ద నుంచి కోట్లు దండుకొని, పత్తా లేకుండా మాయమైంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ సంస్థ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. తమది యూఎస్ బేస్డ్ కంపెనీ అని,…
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు సైబర్ నేరాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. కేటుగాళ్ల వలలో చిక్కి ప్రజలు లక్షలు మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలు తాజాగా రెండు చోటు చేసుకున్నాయి. ఎస్బీఐ అకౌంట్‌కు చెందిన కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ.. బ్యాంకు అధికారిగా ఓ మహిళకు కేటుగాళ్లు ఫోన్ చేశారు. కేవైసీ అప్‌డేట్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని సదరు మహిళను చీటర్స్ భయపెట్టారు. దీంతో నిజమని నమ్మిన ఆ మహిళ బ్యాంకు…
నకిలీ కాల్ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగేళ్ళ వ్యవధిలో 1000 కోట్లు మోసం చేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక సూత్రాధారి నవీన్ భూటానీ కనుసన్నల్లో ఈ ముఠా కార్యకలాపాలు నడిచినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్స్ ను టార్గెట్‌గా చేసుకొని బురుడి కొట్టించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. యూకే , ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల క్రెడిట్ కార్డ్ లకు ఇండియా బ్యాంక్‌లు…
రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి లక్షలు దండుకుంటున్నారు. ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ.2.89లక్షలు వసూలు చేశారు. తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను సదరు వ్యక్తి బంధువులకు పంపుతామని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపించారు. సైబర్ నేరగాళ్ల వేధింపులు అధికమవడంతో బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పాటు మరో వ్యక్తిని ఇన్వెస్ట్మెంట్ పేరుతో 4 లక్షలు మోసం చేశారు…