Cyber Scams: ఇటీవల సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త ఆఫర్లు, ప్రభుత్వ పథకాలు, పండుగలు, ఉచిత రీఛార్జ్‌ల పేరుతో ప్రజలకు ఇ-మెయిల్, మెసేజ్‌ల రూపంలో లింక్స్‌ను పంపిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అలా వారి పంపించిన వాటిని ఓపెన్ చేసిన కొందరికి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. సైబర్ క్రైం పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని హెచ్చరిస్తున్న.. ఏదో రకంగా అమాయక ప్రజలు సైబర్ వలలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఏ ఆఫర్ గురించి తెలుసుకోవాలన్నా సంబంధిత సంస్థల అధికారిక వెబ్‌సైట్ ద్వారానే తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: Recharge Plans: మొబైల్ యూజర్లకు పండగే.. అదిరిపోయే బెనిఫిట్స్ తో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
ఇకపోతే సైబర్ నేరగాళ్లు కొత్తగా వారి రూటు మార్చారు. సంక్రాంతి, మహా కుంభమేళాను టార్గెట్ చేసి ఆ పేరుతో లింక్స్‌ను పంపి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. పండుగల సందర్బంగా ఉచిత రీఛార్జ్‌లు, బంపర్ ఆఫర్లు అంటూ వస్తున్న మెసేజ్‌లు ప్రజలకు నష్టం కలిగించే ప్రమాదం ఉన్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంకా, నకిలీ .Apk లింక్స్ పంపించడం.. ఆ లింక్స్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని గుర్తించారు. ముఖ్యంగా సంక్రాంతి లేదా మహా కుంభమేళా పేరుతో వచ్చే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: Rahul Gandhi: మోడీలానే కేజ్రీవాల్ కూడా తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు
ప్రస్తుతం నూతన సంవత్సర రీఛార్జ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్ల మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు ఉపయోగించి, ఉచిత రీఛార్జ్ ఆఫర్ అందిస్తున్నారని చెబుతూ లింక్ పంపుతున్నారు. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే నేరగాళ్లు ఖాతాలను ఖాళీ చేయడం సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. నూతన సంవత్సర ఆఫర్లు, పండుగల ఆఫర్ల పేరుతో వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దని, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 1930 నంబర్‌కు కాల్ చేయడం లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి, మహా కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు మోసపోవకుండా ఉండేందుకు ఈ సూచనలను పాటించడం మంచింది.